Begin typing your search above and press return to search.
నాని చూపు ఎటు వైపు?
By: Tupaki Desk | 26 May 2019 6:34 AM GMTజెర్సీ సక్సెస్ ఇచ్సిన కిక్ తో న్యాచురల్ స్టార్ నాని మంచి జోష్ లో ఉన్నాడు. పక్కా ప్లానింగ్ తో చాలా జాగ్రత్తగా కథలను ఎంచుకుంటూ సాగుతున్నాడు. ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో గ్యాంగ్ లీడర్ పూర్తి చేసే పనిలో ఉన్న నాని దాంతో పాటే కీలక పాత్ర పోషిస్తున్న ఇంద్రగంటి వి సినిమాను కూడా ఒకేటైంలో ఫినిష్ చేస్తాడు. దీని తర్వాత నాని చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటి అనే దాని గురించి అభిమానుల్లో ఇప్పటికే ఉత్సుకత ఉంది.
పరిస్థితిని గమనిస్తే నాని ముందు ఇప్పటికిప్పుడు రెండు మూడు ఆప్షన్స్ రెడీగా ఉన్నాయని తెలిసింది. ఒకటి గీత గోవిందం దర్శకుడు పరశురామ్ ది. మహేష్ బాబుకు ఈ దర్శకుడు ఓ కథ చెప్పాడన్న ప్రచారానికి భిన్నంగా నిజానికి ఇతను నాని కోసం స్క్రిప్ట్ వండే పనిలో ఉన్నట్టు టాక్. ఇది ఓకే అయితే గీత ఆర్ట్స్ 2 బ్యానర్ లో ఇది రూపొందే ఛాన్స్ ఉంది. నాని గతంలో భలే భలే మగాడివోయ్ చేసింది ఇందులోనే. అయితే అధికారిక ప్రకటన వచ్చేందుకు టైం పట్టవచ్చు.
ఇదిలా ఉండగా వక్కంతం వంశీ సైతం నాని కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడట. అయితే ఇంకా వినిపించలేదని తెలిసింది. నా పేరు సూర్యతో దర్శకుడిగా డిజాస్టర్ డెబ్యూని అందుకున్న వంశీకి సక్సెస్ చాలా కీలకం. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే బండ్ల గణేష్ నిర్మాతగా రీ ఎంట్రీ ఇవ్వొచ్చని వినికిడి. మొత్తానికి నాని కోసం పెద్ద క్యూ వెయిట్ చేస్తోంది. వి పూర్తయ్యేలోపు వీటికి సంబంధించిన నిర్ణయాలు వెలువడొచ్చు