Begin typing your search above and press return to search.

తమిళ హీరో పై పరశురాం ఫోకస్.. నిర్మాతలను ఇలా టార్గెట్ చేశాడా

By:  Tupaki Desk   |   8 Feb 2023 11:00 AM GMT
తమిళ హీరో పై పరశురాం ఫోకస్.. నిర్మాతలను ఇలా టార్గెట్ చేశాడా
X
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు అల్లు అరవింద్​-దిల్​ రాజు తో పాటు దర్శకుడు పరశురాం పేరు చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. గతంలో అరవింద్​ గీతా ఆర్ట్స్ బ్యానర్​లో పరశురామ్ గీత గోవిందం మూవీ చేశాడు. అది డబుల్ బ్లాక్ బస్టర్ హిట్​ అవ్వడంతో.. అల్లు అరవింద్​.. పరుశురాంకు అడ్వాన్స్ ఇచ్చి మరో మూవీ లాక్ చేశారట. కానీ పరశురాంతో నెక్స్ట్ మూవీ దిల్ రాజు బ్యానర్లో విజయ్​ దేవరకొండతో ప్రకటించడంతో అరవింద్​ ఖంగుతిన్నాడు. అలా ప్రస్తుతం ఈ చిత్రాన్ని ప్రకటించడం ఓ కొత్త వివాదానికి దారి తీసింది. ఈ క్రమంలోనే పరశురాం గతంలో కూడా పలు బడా బ్యానర్లు, నిర్మాతల దగర ల అడ్వాన్స్​గా తీసుకున్నారని, . కానీ వారితో ఒక్క సినిమా కూడా చేయకుండా హ్యాండ్ ఇచ్చారని ప్రస్తుతం ప్రచారం సాగుతోంది.

ప్రస్తుతం పరశురాం గురించి మరో తాజా వార్త బయటకు వచ్చింది. అదేంటంటే.. మరో తమిళ హీరోపై కూడా అతడు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ హీరోతో సినిమా చేయాలని భావిస్తున్నాడట. తన లైన ప్ లో ప్రొడ్యూసర్స్ క్యూ కట్టడంతో వారి దగ్గర అడ్వాన్స్ అందుకున్న పరశురాం.. హీరో డేట్స్ ను నిర్మాతలే తీసుకురావాలని వారి మీదనే భారం వేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలా అతడు ప్రొడ్యూసర్స్ నుంచి అడ్వాన్స్ అందుకున్నాడట .

దీనిపై ఇప్పుడు చిత్రసీమలో పెద్ద చర్చే సాగుతోంది. ఇప్పటికే నిర్మాత అరవింద్​ చాలా కోపంగా ఉన్నారని తెలుస్తోంది. పరుశురాం విజయ్ సినిమా విషయంలో దిల్​రాజుకు-ఆయనకు మధ్య కూడా వివాదం ముదిరేలా కొనసాగుతోంది. ఇదే విషయంలో అల్లు అరవింద్ మొన్న ప్రెస్​ మీట్​ కూడా ప్రకటించారు. కానీ తర్వాత ప్రొడ్యూసర్​ గిల్డ్​ జోక్యం చేసుకుని గొడవను తగ్గించే ప్రయత్నం చేశారు. దీంతో అరవింద్ వెనక్కి తగ్గారు.

ఈ క్రమంలోనే తన తాజా ప్రాజెక్ట్ లో... గతంలో అడ్వాన్స్ ఇచ్చిన అల్లు అరవింద్​ను భాగస్వామిని చేసి కూల్ చేయాలని, వివాదం కాకుండా చూడాలని పరశురామ్ ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే ఇప్పుడు అవేమీ ఫలించట్లేదని సమాచారం.

గతంలో పరశురాం ఓ బ్యానర్​ మూవీ చేస్తానని అగ్రీమెంట్​ కుదుర్చుకుని.. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్​తో సర్కారు వారి పాట ప్రకటించారు. దీంతో సదరు ప్రొడక్షన్ హౌస్​ అధినేత అసహనం వ్యక్తం చేయగా.. సర్కారు వారి పాట నిర్మాణ భాగస్వామిగా ఉండేలా చేశారట.

ఇప్పుడదే ఫార్ములాను విజయ్ దేవరకొండ సినిమా విషయంలో చేద్దామని అనుకున్నారట. కానీ అది వర్కౌట్​ కాలేదట. మరి ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈ వివాదం ఎక్కడివరకు వెళ్తుందో చూడాలి. పరశురాం ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అనేది ప్రస్తుతం టాలీవుడ్​లో ఆసక్తికరంగా మారింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.