Begin typing your search above and press return to search.
స్టైలిష్ స్టార్ కోసం పరశురామ్..?
By: Tupaki Desk | 11 Dec 2018 12:29 PM GMT'గీత గోవిందం' తో బ్లాక్ బస్టర్ సాధించిన దర్శకుడు పరశురామ్ తో నెక్స్ట్ సినిమా చేసేందుకు ఆల్రెడీ అడ్వాన్సులు ఇచ్చిన నిర్మాతలతో పాటు గా కొత్త నిర్మాతలు కూడా లైన్లో ఉన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు కూడా ఈ లిస్టులో ఉన్నారట. అయితే 'గీత గోవిందం' లాంటి సినిమాను ఇచ్చిన తర్వాత గీతా ఆర్ట్స్ వారు పరశురామ్ ను వదిలిపెట్టకుండా మరో సినిమాకు లాక్ చేశారు.
'గీత గోవిందం' రిలీజ్ అయ్యి ఇప్పటికి నాలుగు నెలలు అయినా పరశురామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. పరశురామ్ ఇప్పటికే రెండు కథలు రెడీ చేసిపెట్టాడట. కానీ ఎవరితో చేయాలన్న విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదట. ఇదిలా ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. దీంతో బన్నీ కోసం పరశురామ్ కూడా లైన్ లో ఉన్నాడట. తన కథతో బన్నీని మెప్పిస్తే ఎక్కువ ఆలస్యం లేకుండా ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళే అవకాశాన్ని తీసి పారేయలేమని గీతా ఆర్ట్స్ బ్యానర్ కు సన్నిహితంగా ఉండే వారు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏదేమైనా గీతా ఆర్ట్స్ లో తన నెక్స్ట్ సినిమా చేసిన తర్వాతే ఇతర ప్రొడ్యూసర్లతో ఉన్న కమిట్మెంట్లను పూర్తి చేస్తాడట పరశురామ్. మరి స్టైలిష్ స్టార్ ను డైరెక్ట్ చేసే అవకాశం పరశురామ్ కు వస్తుందా లేదా అనేది వేచి చూడాలి.