Begin typing your search above and press return to search.
ఇన్నేళ్లా.? దర్శకుడిపై భార్యకు అనుమానమట..
By: Tupaki Desk | 30 July 2018 11:26 AM GMTగీతాగోవిందం ఆడియో లాంచ్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఫంక్షన్ లో హీరో విజయ్ దేవరకొండ.. ముఖ్య అతిథి అల్లు అర్జున్ మాట్లాడి అలరించారు. అదంతా పక్కనపెడితే దర్శకుడు పరుశురాం మాట్లాడిన ఫ్యాష్ బ్యాక్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ‘గీతాగోవిందం ’ మూవీ ఇంత ఆలస్యం కావడం వెనుక గల కారణాలను పరుశురామ్ చెప్పుకొచ్చాడు.
అల్లు శిరీష్ తో ‘శ్రీరస్తు శుభమస్తు ’హిట్ ఇచ్చిన తర్వాత ఇంప్రెస్ అయిన గీతా ఆర్ట్స్ సంస్థ వెంటనే పరుశురామ్ తో మరో సినిమా చేయడానికి ఒప్పుకుందట.. కానీ ఈ చిత్రం పట్టాలెక్కడానికి చాలా సమయమే పట్టిందని పరుశురామ్ చెప్పుకొచ్చాడు. తాను ‘గీతాగోవిందం సినిమా ఓకే అయ్యాక రోజూ గీతా ఆర్ట్స్ ఆఫీసుకు వెళ్లేవాడినని.. కానీ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ బయటకు రాకపోవడంతో తన భార్య కు కూడా అనుమానం వచ్చిందని తెలిపాడు. స్క్రిప్ట్ పనుల్లో మెరుగులు దిద్దడానికే లేట్ అయ్యిందని..కానీ నా భార్య మాత్రం సినిమా పేరు చెప్పి ఎక్కడికో వెళ్తున్నాcoమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేసిందని పరుశురామ్ చెప్పుకొచ్చాడు. కానీ భార్యకు విడమరిచి చెప్పి అనుమానాలు తీర్చుకున్నానని నవ్వేశాడు ఈ దర్శకుడు..
ఇలా చాలా రోజులు స్క్రిప్ట్ కోసమే ఇంత సమయం తీసుకున్నానని పరుశురామ్ చెప్పుకొచ్చాడు. ‘గీతాగోవిందం’ మొదలు పెట్టాక అర్జున్ రెడ్డి విడుదలైందని.. దాంతో ఓవర్ నైట్ స్టార్ అయినపప్పటికీ.. అతడి వ్యక్తిత్వంలో ఏమాత్రం మార్పులేదని కొనియాడారు. ముందు, తర్వాత అలాగే ఉన్నాడని వివరించాడు. గోవిందంగా విజయ్, గీతాగా రష్మిక పాత్రలకు ప్రాణం పోశారని ప్రశంసించాడు.