Begin typing your search above and press return to search.

గీతా ఆర్ట్స్ ఇండియన్ క్రికెట్ టీం లాంటిదట

By:  Tupaki Desk   |   5 July 2016 1:54 PM GMT
గీతా ఆర్ట్స్ ఇండియన్ క్రికెట్ టీం లాంటిదట
X
ప్రైవేట్ లీగ్స్ లో ఎన్ని మ్యాచ్ లు ఆడినా.. దేశం తరఫున ఇండియన్ టీంకు ఆడితే అదే అసలైన అచీవ్ మెంట్.. అలాగే వేరే బేనర్లలో ఎన్ని సినిమాలు చేసినా గీతా ఆర్ట్స్ లో పని చేయడం ఏ దర్శకుడికైనా గౌవరం.. యువ దర్శకుడు పరశురామ్ అన్న మాట ఇది. అల్లు అరవింద్ నిర్మాణంలో ఆయన తనయుడు అల్లు శిరీష్ కథానాయకుడిగా ‘శ్రీరస్తు శుభమస్తు’ చిత్రాన్ని రూపొందించిన పరశురామ్.. గీతా ఆర్ట్స్ లో పని చేయడాన్ని ప్రివిలేజ్ గా భావిస్తానని అన్నాడు. ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తున్న నేపథ్యంలో విలేకరులతో మాట్లాడాడు పరశురామ్. ఈ సందర్భంగా ఇంకా అతనేమన్నాడంటే..

‘‘శ్రీరస్తు శుభమస్తులో లవ్ స్టోరీ ఉంటుంది. అలాగే ఫ్యామిలీ వాల్యూస్ కూడా ఉంటాయి. మొదలవడం లవ్ స్టోరీలాగే మొదలవుతుంది. కానీ చివరికి వచ్చేసరికి కుటుంబ అంశాలు కీలమవుతాయి. ప్రతి ఫ్యామిలీలో ఉండే డిస్టర్బెన్సెస్ చూపిస్తున్నాం. ఓ సమస్యకు పరిష్కారం కూడా చెబుతున్నాం. నేనేదో ఈ సినిమా కోసం అల్లు శిరీష్ ను ట్రాన్స్ ఫామ్ చేసేశానని అంటున్నారు. అలాంటిదేమీ లేదు. ఇదంతా తన కష్టం. ఎంతో కేర్ తీసుకున్నాడు. 100 శాతం కష్టపడ్డాడు. అతను ఎంతో తపన ఉన్నవాడు. తనకు తెలియని విషయాన్ని కూడా ఎంతో పట్టుదలతో నేర్చుకునేవాడు. రేయింబవళ్లు కష్టపడేవాడు.

ఈ సినిమాతో శిరీష్ సక్సెస్ ఫుల్ హీరోగా నిలదొక్కుకుంటాడు. సినిమాలో హీరో హీరోయిన్లు.. ప్రకాష్ రాజ్.. రావు రమేష్ లతో పాటు ప్రతి క్యారెక్టరుకీ ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి పాత్రా కథతో ముడిపడి ఉంటుంది. గీతా ఆర్ట్స్ లాంటి సంస్థలో పని చేసిన అనుభవాన్ని ఎప్పుడూ మరిచిపోలేను. ఒక బిడ్డను ఎలా సాకుతారో.. ఈ సినిమా మీద అంత కేర్ ఫుల్ గా ఉన్నారు. ఇంకో రెండు మూడు వారాల్లో ఆడియో రిలీజ్ చేసి.. ఆపై సరైన సమయంలో సినిమాను ప్రేక్షకులముందుకు తెస్తాం’’ అని పరశురామ్ చెప్పాడు.