Begin typing your search above and press return to search.

బాల‌య్య కోసం ఏపీ ఒణికే క‌థ రెడీ అవుతోందా?

By:  Tupaki Desk   |   23 Aug 2022 10:40 AM GMT
బాల‌య్య కోసం ఏపీ ఒణికే క‌థ రెడీ అవుతోందా?
X
బాల‌య్య అంటే డైలాగ్.. డైలాగ్ అంటే బాల‌య్య‌! డైలాగుల‌కు పెట్టింది పేరు. సింహాం ఉగ్ర రూప దాల్చితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. బాల‌య్య లో అలాంటి యాంగిల్ ని స్టార్ రైటర్స్ పరుచూరి బ్ర‌ద‌ర్స్ ద్వ‌యం ఎప్పుడో త‌ట్టి లేపారు. బాల‌య్య హీరోగా న‌టించిన ఎన్నో సినిమాల‌కు ర‌చ‌న చేసారు. న‌ట‌సింహానికి సీమ‌లో అంతటి పాపులారిటీ ద‌క్క‌డం వెనుక ఈ ద్వ‌యం కృషి ఎంతో ఉంది.

ఈ ద్వ‌యంతో పాటు చిన్న కృష్ణ సేవ‌లు చిర‌స్మ‌ర‌ణీయ‌మే. ఆ త‌ర్వాతి కాలంలో న‌వ‌త‌రం ర‌చ‌యిత‌లు రావ‌డంతో బ్ర‌ద‌ర్స్ వేగం త‌గ్గింది. చివ‌రిగా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'సైరా న‌ర‌సింహారెడ్డి'కి ప‌నిచేసారు. ఆ త‌ర్వాత ఇంత వ‌ర‌కూ కొత్త ప్రాజెక్ట్ ప్ర‌క‌టించింది లేదు. అయితే ఇప్పుడీ ద్వ‌యం బాల‌య్య కోసం ఏపీ ఒణికించే క‌థ సిద్దం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

రాజ‌కీయ నేప‌థ్యంలో ఓస్టోరీ సిద్దం చేస్తున్న‌ట్లు ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది. జ‌న‌రేష‌న్ ప‌రంగా కాస్త వెనుక‌బ‌డే ఉంటుందిట‌. కొన్ని పాత త‌రం రాజ‌కీయ అంశాల్ని విశ్లేషించి బాల‌య్య కోస‌మే క‌థ సిద్దం చేస్తున్నారుట‌. అందులో బాల‌య్య పాత్ర ఎంతో ప‌వ‌ర్ ఫుల్ గా ఉంటుంద‌ని.. డ్యాష్ అండ్ డేరింగ్ గా సాగుతుంద‌ని స‌మాచారం. బాల‌య్య ఒరిజినాల్టీ స‌హా యాంగ‌ర్ ని బేస్ చేస‌కుని ఈ క‌థ‌ని అల్లుతున్నారుట‌.

యువ‌కుడిగా ఉన్న‌ప్పుడు బాల‌య్య వ్య‌వ‌హార శైలి ఎలా ఉంటుంది? అటుపై 45 దాటిన త‌ర్వాత అత‌నిలో రాజ‌కీయ నాయ‌కుడిగా పార్టీ కండువా క‌ప్పిన నాటి నుంచి బాల‌య్య‌లో ట్రాన్స‌ప‌ర్మేష‌న్ ఎలా ఉంటుంద‌న్న‌ది సినిమాలో ప్ర‌ధానంగా హైలైట్ చేయ‌బోతున్నారుట‌. ఆ మ‌ధ్య ఓ సంద‌ర్భంలో ఈ ద్వ‌యం బాల‌య్య ని క‌లిసిన‌ప్ప‌డు విష‌యం చెప్పి అనుమ‌తి పొంది క‌థ‌ని సిద్దం చేస్తున్న‌ట్లు స‌మాచారం.

మొత్తానికి బాల‌య్య కోసం మ‌రోసారి ఈ ద్వ‌యం ప‌నిచేయ‌డం ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. బాల‌య్య ప‌ల్స్ ప‌ట్టిన ర‌చ‌యిత‌లు కాబ‌ట్టి స్ర్కిప్ట్ ప‌రంగా ఢోకా ఉండ‌దు. ఆ క‌థ‌ని డీల్ చేసే మేక‌ర్ కూడా అంతే గ‌ట్స్ తో ఉండాలి. ప్ర‌స్తుతానికి స్ర్కిప్ట్ ద‌శ‌లోనే ఉంది కాబ‌ట్టి మేక‌ర్ విష‌యంలో ఇంకా ఆలోచ‌న చేయ‌న‌ట్లు తెలుస్తోంది.

ఇక బాల‌య్య చేతిలో వ‌రుస‌గా క‌మిట్ మెంట్లు ఉన్న సంగ‌తి తెలిసిందే. 110వ చిత్రానికి చేరువ‌లో ఉన్నారు. 107వ సినిమా పూర్తిచేసిన త‌ర్వాత 108వ చిత్రాన్ని అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో చేస్తారు. అటుపై 109 పూర్తిచేసి 110 ని లాంచ్ చేస్తారు. అయితే ఈ మేజిక్ నెంబ‌ర్ కి సంబంధించి క‌థ ప‌రంగా యూనిక్ గా ఉండాల‌ని ఇప్ప‌టికే బాల‌య్య భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 'రైతు'..ఆదిత్య 369 సీక్వెల్ లాంటి క‌థ‌లు మ‌ళ్లీ తెర‌పైకి వ‌స్తోన్న నేప‌థ్యంలో పరుచూరి బ్ర‌ద‌ర్స్ రేసులో ఉండే ఛాన్స్ ఉంది.