Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ను పడగొట్టేది ఎవరంటే..

By:  Tupaki Desk   |   31 March 2018 4:23 AM GMT
ఎన్టీఆర్ ను పడగొట్టేది ఎవరంటే..
X
నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్టీఆర్ జీవితగాథ సినిమా పట్టాలెక్కింది. రాజసానికి ప్రతీకంగా ఎన్టీఆర్ కనిపించిన స్టయిల్లోనూ బాలయ్య సైతం కనిపించి అభిమానులను ఖుషీ చేశారు. ఎన్టీఆర్ జీవిత గాథ అనగానే అందులో సినిమాలకు సంబంధించి అంశాలకన్నా రాజకీయ అంశాలపైనే ఫ్యాన్స్ లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. దీంతో పోలిటికల్ పీపుల్ గా ఎంపిక చేసే నటులపై గట్టి కసరత్తే జరుగుతోంది.

ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ లో అత్యంత ముఖ్యమైన వ్యక్తి నాదెండ్ల భాస్కరరావు. 1984లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఎన్టీఆర్ ను గద్దె దింపి తాను సీఎం పీఠం ఎక్కాడు. దానికి ప్రతిగా ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు కూడగట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు. దీంతో తిరిగి ఎన్టీఆరే ముఖ్యమంత్రి అయ్యారు. నాదెండ్ల భాస్కరరావు పాత్రకు విలక్షణ నటుడు పరేష్ రావెల్ ను తీసుకోవాలని సినిమా యూనిట్ ఆలోచిస్తోంది. ఎలాంటి పాత్రనైనా ఈజీగా మెప్పించగలిగే పరేష్ రావెల్ ఈ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాడని యూనిట్ నమ్ముతోంది.

ఈ పాత్రకు ముందు చాలామందినే అనుకున్నాం. కానీ పరేష్ రావెలే అందరికన్నా బాగా సెట్టవుతాడని అనిపించింది. కొంచెం మేకప్ మారిస్తే దాదాపుగా అప్పటి నాదెండ్ల భాస్కరరావుతో అతడి రూపం సరిపోతుంది. ఎన్టీఆర్ తిరిగి పదవి దక్కించుకోవడమే సినిమాలో హైలైట్ గా నిలిచే అంశం అవుతుంది. అందుకే ఇక్కడ దీటైన నటుడి కోసం పరేష్ ను తీసుకోవాలని అనుకుంటున్నాం’’ అని యూనిట్ సభ్యుడొకరు తెలిపారు.