Begin typing your search above and press return to search.
పేరెంట్స్ ను తిట్టుకున్న హీరోయిన్
By: Tupaki Desk | 24 May 2017 9:44 AM GMTపరిణీతి చోప్రా ఇప్పుడు స్టార్ హీరోయిన్ అనే విషయంలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. బాలీవుడ్ టాప్ బ్యూటీ ప్రియాంక చోప్రా కజిన్ సిస్టర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ భామ.. ప్రస్తుతం హిందీ ఫిలిం ఇండస్ట్రీలో వెలిగిపోతోంది. ఈ స్థాయిని అందుకున్న తర్వాత పాత కష్టాలను గుర్తు చేసుకునే ధైర్యం ఎవరూ చేయరు.
చిన్నప్పుడు బాధలు అనుభవించినా.. వాటిని ఇప్పుడు చెప్పేందుకు ఇష్టపడరు. కానీ పరిణీతి మాత్రం చాలా ఓపెన్ గా తన కష్టాలను చెప్పేసింది. స్టార్ హీరోయిన్ కి రిలెటివ్స్ అయినా.. తమది మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే అన్న పరిణీతి.. హైస్కూల్ కు సైకిల్ పై వెళ్లేదట. ఆ సమయంలో కుర్రాళ్లు సైకిల్ కు అడ్డు పడ్డం.. స్కర్ట్ లాగడం వంటివి చేసినపుడు ఏడుపు వచ్చేసేదట. ఆర్థిక కష్టాలు వెంటాడడం వంటి పరిస్థితుల కారణంగా.. తల్లిదండ్రులపై విపరీతమైన కోపం వచ్చేదని చెప్పింది పరిణీతి.
కానీ ఇప్పుడు అప్పటి పరిస్థితులను తలచుకుంటే పేరెంట్స్ అనుభవించిన సిట్యుయేషన్ గుర్తొచ్చినప్పుడల్లా బాధతో పాటు జాలి కూడా కలుగుతుందని చెప్పింది. ఇప్పుడు స్టార్ స్టేటస్ అనుభవిస్తూ కూడా.. ఆ నాటి కష్టాలను మరిచిపోని పరిణీతి.. ఇప్పుడు బాగా పరిణతి సాధించానని అంటోంది.