Begin typing your search above and press return to search.
పొట్టి పరికిణీలో పరిణీతం
By: Tupaki Desk | 22 Aug 2018 1:30 AM GMTఅక్క కోసం చెల్లి.. చెల్లి కోసం అక్క అన్నట్టే ఉంటారు ప్రియాంక చోప్రా - పరిణీతి చోప్రా. ఆ ఇద్దరి మధ్యా అనుబంధం అలాంటిది. అక్క విదేశీ కుర్రాడిని ప్రేమించానని తొలిసారిగా చెప్పింది పరిణీతికేనట. ఆ తర్వాత నిక్ జోనాస్ ని నేరుగా ముంబైకి తీసుకొచ్చేసినప్పుడు పరిణీతి అక్క- బావల వెంటే ఉండి కంపెనీ ఇచ్చింది. బ్రిటీష్ రాకుమారుడు కం నటుడు నిక్ జోనాస్ కి ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్నీ తీనే అయ్యి చూసుకుంది. అప్పట్లోనే గోవా బీచ్ లో సెలబ్రేసన్స్ వేళ నిక్ కి హాస్పిటాలిటీ ఇచ్చింది చెల్లాయి పరిణీతినే.
ఆ తర్వాత రోకా (నిశ్చితార్థం) పార్టీ లోనూ పరిణీతి చోప్రానే తెగ సందడి చేసింది. అక్క వేడుక ఆద్యంతం కళ్లన్నీ తనపైనే ఉండేలా స్పెషల్ లుక్ తో అప్పియరెన్స్ ఇచ్చింది. పొట్టి పరికిణీలో ఈవెంట్ ఆద్యంతం కలియతిరిగేస్తూ పరిణీతి చేసిన హంగామా అంతా ఇంతా కాదని ఆ తర్వాత లీకైన ఫోటోలు చెప్పాయి. ఇదిగో వాటిలోంచి బయటపడిన ఆణిముత్యంలాంటి ఫోటో ఇది.
బ్లాక్ అండ్ పర్పుల్ కలర్డ్ బార్డర్ ఫ్రాకులో పరిణీతి కనిపించిన తీరు కళ్లు తిప్పుకోనివ్వలేదంటే నమ్మండి. రోకా ఈవెంట్ ఆద్యంతం పూర్తయ్యాక - ఆ తర్వాత పీసీతో కలిసి నైట్ పార్టీలోనూ అక్కా బావలకు అంతా తనే అన్నీ అయ్యింది. ఆరోజంతా నిక్ జోనాస్ కి అవసరమైన సౌకర్యాలు తనే చూసుకుందిట. నాలుగు రోజుల పాటు నిక్ ఇండియాలో రకరకాల ప్లేస్ లు విజిట్ చేసి వెళ్లాడు. మొత్తానికి పీసీని ప్రేమించినందుకు తనకు పరిణీతం రూపంలో మరో మంచి కంపెనీ దొరికింది. ఆసక్తికరంగా ఈ నాలుగురోజుల్లో ఓ ఆసక్తికరమైన ట్విస్టు కూడా బయటపడింది. పరిణీతి బావగారికి కంపెనీ ఇవ్వడమే కాదు.. ఓసారి తనని ఏడిపించేందుకు అతగాడి షూస్ ని కొట్టేసిందిట. అవి కనిపించక నిక్ అన్నిచోట్లా వెతుక్కుని ఏమైందా? అంటూ చిన్నబుచ్చుకున్నాడట. చివరికి కొంటె పిల్ల అల్లరిగా బావ షూస్‌ని తిరిగి ఇచ్చేసి ఇండియన్ స్టైల్ మరదలు అంటే ఏంటో చూపించేసిందిట. అదీ సంగతి.