Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: లిల్లీ పువ్వులా ఉందే

By:  Tupaki Desk   |   2 Oct 2015 7:30 PM GMT
ఫోటో స్టోరి: లిల్లీ పువ్వులా ఉందే
X
చ‌క్క‌న‌మ్మ చిక్కినా అంద‌మే. బొద్ద‌మ్మాయ్ ప‌రిణీతి మారిన లుక్‌ లో ఇర‌గ‌దీస్తోంది. ఈ అమ్మ‌డు ఇటీవ‌లి కాలంలో శ‌రీరం నుంచి అన‌వ‌స‌ర కొలెస్ట‌రాల్ తొల‌గించి స‌రికొత్త రూపురేఖ‌ల‌తో త‌ళుక్కుమంటోంది. రూపురేఖ‌ల్లో అనూహ్యంగా వ‌చ్చిన మార్పు ఇది. బాగా తిని, బాగా లావెక్కి, అటుపై ఆ రూపంపై పుట్టిన అస‌హ్యంతో తిరిగి ప‌ట్టుద‌ల‌గా ఇలా మారిపోయింది అమ్మ‌డు. అప్ప‌ట్లో కిల్ దిల్ చిత్రంతో కుర్రాళ్ల‌ను కిల్ చేసేసిందే అని ముచ్చ‌టించుకున్నారు. అప్ప‌టికే ఈ భామ‌లో బోలెడ‌న్ని మార్పులు చోటు చేసుకున్నాయి. నిరంత‌రం జిమ్ముల్లో క‌స‌ర‌త్తులు చేస్తూ శ‌రీరాకృతిని చాలా వ‌ర‌కూ టోన్ డౌన్ చేసింది. రూప‌లావ‌ణ్యంలో మెరుగులు దిద్దింది.

ఇప్పుడు మారిన ఆ రూపంతోనే ఎల్లే మ్యాగ‌జైన్ అక్టోబ‌ర్ క‌వ‌ర్‌ పేజ్ పై ద‌ర్శ‌న‌మిచ్చింది. న్యూ బాడీ - న్యూ కాన్ఫిడెన్స్ అంటూ కాంపిటీష‌న్ రెయిజ్ చేసింది. ఇప్పుడు మారిన ఈ రూపం చూశాక అభిమానులంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. లేటెస్టుగా మ్యాగ‌జైన్ క‌వ‌ర్‌ పేజీపై ప‌రిణీతి రూపం బాలీవుడ్‌ లో హాట్ టాపిక్ అయ్యింది. ర‌క‌ర‌కాల డిజైన‌ర్ డ్రెస్సుల్లో ఈ అమ్మ‌డు హొయ‌లు పోయిన తీరు న‌వ‌తరంలో టాపిక్ అయ్యింది. ఒబిసటీ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే అమ్మాయిలంతా ప‌రిణీతిని చూసి ఈసారి మ‌న‌సు మార్చుకోవాల్సిందే. ఈ కొత్త లుక్ లో నిజంగానే కాన్ఫిడెన్స్ ఇనుమ‌డిస్తోంది. ఆ క‌నుబొమ్మ‌లు ఎగ‌రేస్తున్న తీరు చూస్తే ఎవ‌రికైనా కిక్కెక్కి పోవాల్సిందే. లిల్లీ పువ్వుకు మారు రూపంలా క‌నిపించ‌డం లేదూ?