Begin typing your search above and press return to search.
యంగ్ టైగర్ సరసన పరిణీతి?
By: Tupaki Desk | 28 Oct 2015 4:22 AM GMTయంగ్ యమ ఎన్టీఆర్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో నాన్నకు ప్రేమతో చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించే సినిమాకి సన్నాహాలు సాగుతున్నాయి. శ్రీమంతుడు చిత్రాన్ని నిర్మించిన మైత్రి మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇటీవలే ఠెంకాయ కార్యక్రమం పూర్తయింది. ప్రీప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. త్వరలోనే రెగ్యులర్ చిత్రీకరణకు వెళ్లనున్నారు. అయితే అంతకంటే ముందే ఎన్టీఆర్ సరసన కథానాయికలు ఎవరు? అన్న చర్చ సాగుతోంది.
ఎన్టీఆర్ సరసన ఈసారి ఫ్రెష్ లుక్ ఉన్న హీరోయిన్లను ఎంపిక చేయాలని కొరటాల భావిస్తున్నాడు. అందుకే ఇప్పటికే బాలీవుడ్ హాట్ గాళ్ పరిణీతి చోప్రాని సంప్రదించారని సమాచారం. పరిణీతి తో ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. ఇంకా ప్రాజెక్టుకు కమిటవ్వలేదు. ఒకవేళ కమిటైతే పరిణీతి ప్రధాన నాయిక. తనతో పాటే మరో కథానాయిక కూడా అవసరం. అలాగే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకు టాలీవుడ్ కి చెందిన ఓ పాపులర్ నటుడిని ఎంపిక చేయనున్నారని టాక్.
పరిణీతి ఇప్పటివరకూ ఒక్క తెలుగు సినిమాకి కూడా సంతకం చేయలేదు. గతంలో మహేష్ సరసన నటిస్తుందని వార్తలొచ్చినా కాల్షీట్ల సమస్య తలెత్తింది. పలువురు సంప్రదించినా బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల డేట్లు ఎడ్జస్ట్ చేయలేకపోయింది. ఈసారి ఎన్టీఆర్ తో కన్ఫమ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వెయిట్ అండ్ సీ.