Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ప‌రిణీతి లుక్స్ అదుర్స్‌

By:  Tupaki Desk   |   2 March 2018 10:27 AM GMT
ఫోటో స్టోరి: ప‌రిణీతి లుక్స్ అదుర్స్‌
X
క్యూట్ లుక్స్‌... స్టైలిష్ యాక్టింగ్... ప‌రిణీతి చోప్రా సొంతం. ప్రియాంక చోప్రా... మీరా చోప్రా... మ‌న్నారా చోప్రా... వీరంతా క‌జిన్స్‌. అనుకోకుండా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ప‌రిణీతి... రోజురోజుకి అందాన్ని పెంచుకుంటూ... న్యూలుక్స్ తో అభిమానుల‌కు క‌నువిందు చేస్తోంది. ఇదిగో ఇప్పుడు... సాంప్ర‌దాయ దుస్తుల్లో అందంగా ద‌ర్శ‌న‌మిస్తోంది. అంద‌మైన అమ్మాయి... ఇంకా అంద‌మైన సాంప‌ద్రాయ దుస్తుల్లో ఫోటోల‌కు ఫోజులిస్తే... ఎవ‌రైనా ప‌డిపోవాల్సిందే క‌దా.

ఫేమీనా మ్యాగ‌జైన్ వారు వెడ్డింగ్ టైమ్ పేరుతో పెళ్లి దుస్తుల క‌లెక్ష‌న్ ఫోటోషూట్ చేశారు. అందులో ప‌రిణీతి కూడా ఎరుపు రంగు లెహెంగాలో మెరిసింది. భుజాల దాకా వేలాడే చెవి దిద్దుల‌తో అందంగా ముస్తాబైంది. కిల్లింగ్ లుక్స్‌తో ఆమె ఫోటోకు ఫోజిచ్చింది. ఇంకేముంది ఆ ఫోటో మీడియాలో చెంత‌కు చేర‌డం.. చ‌క్క‌ర్లు కొట్ట‌డం ప్రారంభ‌మైంది. ప‌రిణీతి చివ‌ర‌గా గోల్ మాల్ ఎగైన్ సినిమాలో చేసింది. ప్ర‌స్తుతం మ‌రో సినిమాలో న‌టిస్తోంది. మ‌ధ్య‌మ‌ధ్య‌లో ఇలాంటి ఫోటో షూట్లు కామ‌నే క‌దా.

ముందుగా బ్యాంకింగ్ రంగంలో స్థిర‌ప‌డ‌దామ‌నుకుంది ప‌రిణీతి. కానీ కుద‌ర‌లేదు. యశ్ రాజ్ ఫిలింస్ సంస్థలో పబ్లిక్ రిలేషన్స్ కన్సల్టెంట్ గా పనిచేసింది. ఆ స‌మ‌యంలో అందంగా ఉన్న ప‌రిణీతికి హీరోయిన్ ఛాన్స్ వ‌చ్చింది. 2011లో లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. ఇక న‌టిగానే స్థిర‌ప‌డిపోయింది.