Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: ఏదో తెలీని మైకంలో ఉన్న కాస్మో గాళ్ పారీ

By:  Tupaki Desk   |   2 March 2021 3:30 PM GMT
ఫోటో స్టోరి: ఏదో తెలీని మైకంలో ఉన్న కాస్మో గాళ్ పారీ
X
బాలీవుడ్ లో ప్ర‌స్తుతం ఉన్న క్రేజీ భామ‌ల్లో ఒక‌రిగా ప‌రిణీతి పేరు మార్మోగుతోంది. ఈ భామ ఇటీవ‌లే సైలెంటుగా స్లీప‌ర్ హిట్ అందుకుంది. ప‌రిణీతి న‌టించిన రీమేక్ మూవీ `ది గర్ల్ ఆన్ ది ట్రైన్` నెట్ ఫ్లిక్స్ లో రిలీజై ఆరంభం మిశ్ర‌మ స్పంద‌న‌లు అందుకుంది. కానీ నెమ్మ‌దిగా పుంజుకుంది. ముఖ్యంగా ప‌రిణీతి న‌ట‌న‌ను మాత్రం క్రిటిక్స్ ఆకాశానికెత్తేశారు.

ఆ క్ర‌మంలోనే ప‌రిణీతి సోష‌ల్ మీడియాల్లో త‌న అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది. ది గ‌ర్ల్ ఆన్ ది ట్రైన్ విజ‌యం చాలా సంతృప్తినిచ్చింద‌ని పారీ మ‌రోసారి మ్యాగ‌జైన్ ఇంట‌ర్వ్యూల్లో ఆనందం వ్య‌క్తం చేసింది. ఈ చిత్రం ప్ర‌ఖ్యాత హాలీవుడ్ స్టార్ ఎమిలీ బ్లంట్ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ మూవీకి హిందీ రీమేక్. హాలీవుడ్ చిత్రం పౌలా హాకిన్స్ 2015 బెస్ట్ సెల్లర్ కి తెరానువాదం. బాలీవుడ్ వెర్షన్ కు రిభు దాస్ గుప్తా దర్శకత్వం వహించారు. ఇందులో పారీతో పాటు అదితి రావు హైద‌రీ- కీర్తి కుల్హారీ త‌దిత‌రులు న‌టించారు.

బాగా తాగి తంద‌నాలాడే అమ్మాయిగా అమ్నేషియా అనే అరుదైన రోగ‌గ్ర‌స్తురాలిగా పారీ ఈ చిత్రంలో న‌టించింది. మీరా క‌పూర్ త‌న పాత్ర పేరు. ఈ సినిమా కథ హత్య.. ముట్టడి... అసూయ నేప‌థ్యంలో హై-ఆక్టేన్ థ్రిల్స్ తో ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంది. ముఖ్యంగా పారీ న‌ట‌న మూవీ ఆద్యంతం హైలైట్ గా నిలిచింద‌ని క్రిటిక్స్ ప్ర‌శంసించారు.

ఇదే ఉత్సాహంలో తాజాగా ప‌రిణీతి ప్ర‌ఖ్యాత కాస్మోపాలిట‌న్ క‌వ‌ర్ పేజీపై ప్ర‌త్య‌క్ష‌మైంది. ప‌సుపు వ‌ర్ణం డిజైన‌ర్ డ్రెస్ లో ప‌రిణీతి ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌రంలో వైర‌ల్ గా మారింది.

ఈ ఏడాది ప‌రిణీతికి మూడు బ్యాక్-టు-బ్యాక్ థియేట్రికల్ రిలీజ్ లతో అద‌ర‌గొడుతోంది. ది గ‌ర్ల్ ఆన్ ది ట్రైన్ ఇప్ప‌టికే రిలీజ్ కాగా.. సందీప్ పిర్ పింకీ ఫర్రార్ చిత్రం మార్చి 19 న విడుదల కానుంది. అలాగే సైనా నెహ్వాల్ బ‌యోపిక్ మార్చి 26 న రిలీజ్ కానుంది.