Begin typing your search above and press return to search.

షర్టు డ్రెస్ లో మెరిసిన ప్రియాంక చెల్లి!

By:  Tupaki Desk   |   11 July 2019 4:50 PM GMT
షర్టు డ్రెస్ లో మెరిసిన ప్రియాంక చెల్లి!
X
బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా తెలుసు కదా. ప్రియాంక చోప్రాకు కజిన్.. ముద్దుల చెల్లి. ఇప్పటికే బాలీవుడ్ లో పలు విజయవంతమైన చిత్రాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సాధించింది. పరిణీతి ప్రస్తుతం 'జబారియా జోడి 'అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమానుండి జిల్లా హిలేలా అంటూ సాగే ఒక మాసు సాంగును విడుదల చేశారు.

ఈ పాట పరిణీతి పైన చిత్రీకరించినది కాదు. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా.. ఎల్లి అవ్రామ్ లపైన చిత్రీకరించిన పాట. అయినా ఈ సినిమాలో పరిణీతి మెయిన్ హీరోయిన్ కావడంతో ఈ పాట లాంచ్ కార్యక్రమానికి చక్కగా రెడీ అయి వచ్చింది. షర్టు లాగా ఉండే ఉండే పిస్తా కలర్ డ్రెస్ ధరించి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది. మెడకు టర్టిల్ నెక్ డిజైన్ తో.. స్లీవ్స్ ను మడుచుకొని బుట్టబొమ్మ లాగా కనిపించింది. పెండెంట్ ఉన్న సన్నటి చెయిన్ వేసుకుంది. ప్యాంట్ ధరించకపోవడంతో కాళ్ళ అందాలు బయటపడ్డాయి. ఈ స్టైలిష్ డ్రెస్ కు తోడు చిరునవ్వు రువ్వుతూ అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ 'జబారియా జోడి' సినిమాను లక్నో నేపథ్యంలో తెరకెక్కించారని సమాచారం. ఈ చిత్రానికి దర్శకుడు ప్రశాంత్ సింగ్. ఎలాగూ పాట లాంచ్ కు పరిణీతి వేసుకున్న డ్రెస్ గురించి మాట్లాడుకున్నాం కదా.. ఆ పాటను కూడా చూసేస్తే ఒక పని అయిపోతుంది. జిల్లా హిలేలా పై ఒక లుక్కేయండి. అన్నట్టు ఈ పాట కు సంగీతం అందించిన వారు ఎవరో కాదు. సాహో లలోని సైకో సయ్యా పాటను కంపోజ్ చేసిన తనిష్క్ బాగ్చి.