Begin typing your search above and press return to search.
ఫోటో స్టోరి: హలో ఈజిప్టు రాణి!!
By: Tupaki Desk | 2 Jun 2017 4:26 AM GMTబాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా.. ఒకప్పుడో బోలెడంత బొద్దుగా ఉండేదనే సంగతి తెలిసిందే. ఎంత కష్టపడి అదనంగా ఉన్న ఫ్యాట్ అంతా కరిగించేసుకుని.. ఇప్పుడు బాగా సన్నబడింది. మరీ జీరో సైజుల్లోకి వచ్చేయకపోయినా.. ఈ జనరేషన్ బ్యూటీస్ కి సమానంగా స్లిమ్ అయిపోయి.. కొత్త అందాలతో మెరిపిస్తోంది. ఇందుకోసం సినిమాలకు రెండేళ్లు గ్యాప్ వచ్చినా పెద్దగా లెక్క చేయలేదంటే పరిణీతి కమిట్మెంట్ అర్ధమవుతుంది.
ఇప్పుడీ భామ ఈజిప్టు రాణి రేంజ్ లో తయారైపోయింది. హలో మేగజైన్ జూన్ ఇష్యూ కవర్ పేజ్ కోసం పరిణీతి గ్లామర్ అంతా కమ్మరించేసింది. ఈజిప్ట్ బ్యాక్ డ్రాప్ తో.. పిరమిడ్స్ మధ్యలో.. అమ్మడి గెటప్ కొత్తగా ఉంది. స్లీవ్స్.. నెక్ లైన్ ను ఫెదర్స్ మాదిరిగా డిజైన్ చేసిన ఈ డ్రెస్.. చూడగానే ఆకట్టుకుంటుంది. థీమ్ కు తగినట్లుగా ఉన్న ఆభరణాలు స్పెషల్. వీటన్నిటికీ మించి పరిణీతి చోప్రా స్లీక్ హెయిర్.. సెక్సీ లుక్ ఈ కవర్ పేజ్ కు కొత్త అందాలను తీసుకొచ్చాయి.
ఫ్యాషన్ గురించి.. ఫిట్నెస్ గురించి బోలెడన్ని కబుర్లు చెప్పింది పరిణీతి చోప్రా. ఇక సినిమాల విషయానికి వస్తే గత నెలలో రిలీజ్ అయిన మేరీ ప్యారీ బిందు జనాలను ఆకట్టుకోలేకపోయింది. పెట్టిన ఖర్చు మేరకు కూడా రాబట్టుకోలేకపోయింది. సినిమా ఫ్లాపైనా.. ఇలా ఫోటో షూట్లతో రెచ్చగొడుతోన్న పరిణీతి చోప్రా.. గోల్ మాల్ ఎగైన్ అంటూ గోల్ మాల్ చేసేస్తానంటోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/