Begin typing your search above and press return to search.
ఇప్పటివరకు ఎవర్ని ప్రేమించలేదు
By: Tupaki Desk | 24 Oct 2016 9:30 AM GMTసినిమా సెలబ్రిటీల పర్సనల్ సంగతులపై ఫ్యాన్స్ లో బోలెడంత ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్స్ విషయానికొస్తే.. వాళ్ల ప్రతీ కదలికను అబ్జర్వ్ చేసేస్తూ.. ఎవరితోనైనా డిన్నర్ కి వెళ్లినా డేటింగ్ కి వెళ్లిపోయారని రాసేసి రచ్చ చేయగల మహానుభావులు మన మీడియాలో కోకొల్లలు. మరీ ఇలాంటి హంగామా సృష్టించడం ఎందుకు అనుకుందో.. తన లవ్ స్టోరీని దాయాల్సిన అవసరం ఏంటి అని భావించిందో కానీ.. పరిణీతి చోప్రా మాత్రం ప్రేమ కబుర్లు వల్లించేస్తోంది.
'కొన్నేళ్ల క్రితం వరకూ నేను ఎవరినైనా ప్రేమిస్తా.. ఆ సంగతులు అందరికీ చెప్పాలనే అనుకునే దాన్ని. ఇప్పటికీ ఆ డెసిషన్ లో ఛేంజ్ లేదు కానీ.. ఆ టాపిక్ గురించి ఒకటికి పది సార్లు మాట్లాడ్డం మాత్రం అస్సలు నచ్చదు. ఇలా చెబుతున్నాను కానీ.. ఇప్పటివరకూ నేను ఎవరినీ ప్రేమించలేదు. కాకపోతే నా లైఫ్ లో ఎవరైనా ఒక తోడు తొందరగా రావాలని మాత్రం కోరుకుంటున్నా. నన్ను నన్నుగా ప్రేమించే వాడి కోసం నా గుండె తలుపులు తెరిచే ఉంచుతా' అంటూ ప్రియమైన ప్రేమికుడికి ఆహ్వానం పలుకుతోంది పరిణీతి చోప్రా. త్వరలోనే ఎవరో ఒకరు వచ్చేస్తారని బోలెడంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిణీతి చోప్రా.. తనపై వచ్చే వార్తలు తన పర్సనల్ లైఫ్ పై ఎఫెక్ట్ చూపించకూడదనే ఉద్దేశ్యంతోనే ఓపెన్ గా ఉండాలని డిసైడ్ అయిపోయిందట.
మొత్తానికి ఈ బాలీవుడ్ హీరోయిన్లు.. ఊరందరికీ తెలిసిన ఎఫైర్ల గురించి అబద్దాలు భలే సింపుల్ గా చెప్పేస్తుంటారు. అసలు దర్శకుడు మనీష్ శర్మతో ప్రేమాయణం కారణంగా.. అమ్మడికి లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్ చిత్రంలో ఒక హీరోయిన్ గా అవకాశం వచ్చిందనేది బాలీవుడ్ టాక్. ఇప్పుడేమో ఇలా కథలు చెబుతోంది అమ్మడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/