Begin typing your search above and press return to search.
అక్కని చూస్తే భయం వేస్తోందట
By: Tupaki Desk | 29 Feb 2016 10:30 PM GMTబాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి, అక్కడి నుంచి ఆస్కార్ అవార్డు అందించే రేంజ్ కి ప్రియాంక చోప్రా ఎదిగిపోయింది. ఆస్కార్ ని ప్రదారం చేసిన తొలి భారతీయురాలిగా ఓ కొత్త రికార్డు నమోదు చేసిన ప్రియాంక.. ఇప్పుడు దేశంలో చాలామందికి స్ఫూర్తి. అలాగే ఇక ప్రియాంకను అందుకోవడం కష్టమేమో అనిపించేలా దూసుకుపోతోంది. ఈ హీరోయిన్ సాధిస్తున్న విజయాలు చూస్తుంటే అసూయ సంగతేమో కానీ.. అసలు భయం వేస్తోందని చెబుతోంది చెల్లెలు పరిణీతి చోప్రా.
‘అక్క సాధిస్తున్నది చూస్తుంటే.. అక్క కంటే నాకే ఎక్కువ థ్రిల్లింగ్ గా ఉంది. యాక్టింగ్ కెరీర్ లో ఆమె సాధించిన విజయాలు చూస్తే అప్పుడప్పుడు నాకే భయంగా అనిపిస్తుంది’ అని చెప్పింది పరిణీతి. హాలీవుడ్‌లో పేరు తెచ్చుకోవడమంటే మామూలు విషయం కాదని.. అదీ ఓ భారతీయ నటికి ఇది చాలా కష్టం అని అంటోందీ హీరోయిన్. ట్యాలెంట్ తో హాలీవుడ్ చిత్రాల్లో విభిన్న పాత్రల్లో అవకాశం అందుకుని పేరు తెచ్చుకుంటున్న ప్రియాంకను చూస్తే ఎంతో గర్వంగా ఉందని చెప్పింది పరిణీతి.
అక్క సంగతి సరే.. మీకు హాలీవుడ్ సినిమాల్లో అవకాశం వస్తే వెళ్తారా అంటే.. 'హాలీవుడ్‌లో అవకాశం అంటే ఎందుకు వదులుకుంటాను. కానీ ఇప్పుడైతే కాదు. అందుకు కాస్త సమయం పడుతుంది' అంటూ మనసులో కోరిక చెప్పింది పరిణీతి.