Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ : ప‌రిణ‌య ప‌రిణీతం

By:  Tupaki Desk   |   2 May 2019 5:30 PM GMT
ఫోటో స్టోరీ : ప‌రిణ‌య ప‌రిణీతం
X
అందాల ప‌రిణీతికి పెళ్లాడే వ‌య‌సొచ్చెను. ఆ జాడ ఈ లుక్ లో స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. అంత‌గా ఫెమీనా వెడ్డింగ్ టైమ్స్ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ పై ఒదిగిపోయి క‌నిపించింది మ‌రి. క‌వ‌ర్ పేజీల్ని వేడెక్కించ‌డంలో ఇటీవ‌ల ప‌రిణీతి అంత‌కంత‌కు రెట్టించిన ఉత్సాహంతో క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. సామాజిక మాధ్య‌మాల్లో రెగ్యుల‌ర్ గా ఫ్యాన్స్ కి ఫోటోలు - వీడియోల‌తో ట్రీట్ ఇస్తోంది.

ఇక వ్య‌క్తిగ‌త సంగ‌తి చూస్తే.. యువ హీరో అర్జున్ తో ఎఫైర్ అంటూ అప్ప‌ట్లో ప్ర‌చార‌మైనా ప్ర‌స్తుతం సింగిల్ స్టాట‌స్ తోనే ఉంది ఈ అమ్మ‌డు. సిస్ట‌ర్ ప్రియాంక చోప్రా విదేశీ బోయ్ ఫ్రెండ్ నిక్ జోనాస్ ని పెళ్లాడుతోంద‌ని తెలుసుకున్న‌ప్ప‌టి నుంచి బావ నిక్ తో ఈ అమ్మ‌డి ప‌రాచికాలు అంతే హైలైట్ అయ్యాయి. ఇక ఇదే హుషారులో ప‌రిణీతికి కూడా పెళ్లి కొడుకును వెతికేయ‌డం ఖాయ‌మ‌ని మాట్లాడుకున్నారు. అదంతా స‌రే.. ప‌రిణీతి లేటెస్ట్ ఫోటోషూట్ లో సంథింగ్ స్పెష‌ల్ లుక్ తో వేడెక్కించ‌డం హాట్ టాపిక్ గా మారింది.

ప‌ఖ్యాత వెడ్డింగ్ టైమ్స్ కోసం ప‌రిణీతి త‌న‌లోని కొత్త కోణాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఆ రెడ్ డ్రెస్ లో పెర్ఫెక్ట్ గా ఒదిగిపోయి క‌నిపిస్తోంది. ఇక భారీత‌నం ఉన్న‌ క్రిస్ట‌ల్ నెక్లెస్ ఆ మెడ‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా క‌నిపిస్తోంది.. సింపుల్ స్మైలీ లుక్.. ఆ సింపుల్ రెడ్ లైన‌ప్ శిరోజాల‌తో ప‌రిణీతి ఎంతో ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంది. వ‌ర్కింగ్ విత్ స్పోటిఫై అంటూ ఇటీవ‌లే ఓ మ్యూజిక్ థీమ్ త‌న‌ని బాగా ఇంప్రెస్ చేసేసింద‌ని ట్విట్ట‌ర్ మాధ్య‌మంలో రివీల్ చేసింది. క‌థానాయిక‌గా ప‌రిణీతి కెరీర్ ప‌రిశీలిస్తే నాలుగు సినిమాల్లో న‌టిస్తోంది. ఇటీవ‌లే కేస‌రి రిలీజైంది. బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌ర్వాలేద‌నిపించింది. సందీప్ ఔర్ పింకీ ఫ‌రార్.. జ‌బారియా జోడీ .. సైనా... భుజ్- ది ప్రైడ్ ఆఫ్ ఇండియా చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. వీటితో పాటే ఏ గ‌ర్ల్ ఆన్ ది ట్రైన్ రీమేక్ లోనూ న‌టిస్తూ బిజీగా ఉంది.