Begin typing your search above and press return to search.
గాసిప్ లపై అన్నీ చెప్పేసిన పరిణీతి
By: Tupaki Desk | 18 Aug 2016 10:30 PM GMTసినిమాలంటేనే గ్లామర్ ఫీల్డ్. ఈ రంగంలో ఫేమ్.. క్రేజ్ ఏ రేంజ్ లో వస్తాయో.. రూమర్స్ గాసిప్పులు కూడా అంతకు మించి వస్తాయి. అసలు కొంతమంది ఫేమస్ అవ్వడానికి వీటినే రూట్ గా ఎంచుకుంటారు కానీ.. మరికొంతమందిపై మాత్రం ఏం చేయకుండానే బోలెడన్ని పుట్టుకొస్తాయి. ఇలా తనపై వచ్చిన అనేక రూమర్స్ తో విసిగిపోయిన పరిణీతి చోప్రా నోరు విప్పేసి.. అన్నిటికీ ఒకేసారి సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించింది.
పరిణీతికి చాలామందితోనే ముడిపెట్టి రూమర్స్ పుట్టుకొచ్చాయి కానీ.. వీటిలో మనీష్ శర్మ.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ లతో అఫైర్ అంటూ ఎక్కువ సార్లు వినిపించింది. ' నేను ఇలాంటి రూమర్లను చాలా సార్లే విన్నాను. నాకు మనీష్ తో ఆరేళ్లుగా పరిచయం ఉంది. మేము డేటింగ్ లో లేమని చాలాసార్లు చెప్పాను. నేను రోజూ ఆదిత్యచోప్రా ఆఫీస్ లో మనీశ్ క్యాబిన్ కి వెళ్లి అతన్ని కలుస్తున్నానని రాస్తున్నారు. తనకు ఆ ఆఫీసులో క్యాబిన్ ఎక్కడుందని మనీష్ నన్నే అడుగుతున్నాడు' అని నిలదీసింది పరిణీతి.
'గతంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తో నాకు లవ్ అఫైర్ ఉందని పుకార్లు వచ్చాయి. ఓ ఏడాదిగా అతన్ని నేను ఒకసారి కూడా కలవలేదు. ఓ నైట్ సుశాంత్ తో గడిపాక.. నాతో బ్రేకప్ అయి వెళ్లిపోయాడని రాశారు. నేను సుశాంత్ చివరగా మాట్లాడినదే నాకు గుర్తులేదు. నా చుట్టూ ఉన్నవాళ్లు ఇలాంటి తప్పుడు వార్తలు పుట్టిస్తున్నారు’’ అంటూ తెగ బాధపడిపోయింది పరిణీతి చోప్రా. తనపై వస్తున్న రూమర్లకు ఇంత డీటైల్డ్ గా వివరణచెప్పాకయినా.. రూమర్స్ కి బ్రేక్ పడుతుందో లేదో చూడాలి.