Begin typing your search above and press return to search.

నాలా ఉంటేనే నాకు నచ్చుతాడంటున్న బ్యూటీ

By:  Tupaki Desk   |   19 July 2016 7:30 PM GMT
నాలా ఉంటేనే నాకు నచ్చుతాడంటున్న బ్యూటీ
X
బాలీవుడ్ బొద్దుగుమ్మ ఇమేజ్ నుంచి నాజూకు సుందరిగా మారిపోయిన వయ్యారి పరిణీతి చోప్రా. ఈమెను రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటింపచేసి టాలీవుడ్ అరంగేట్రం చేయిద్దామని అనుకున్నారు కానీ.. డీల్ సెట్ కాలేదు.

గతంలో బొద్దుగా ఉందనే నెపంతో దూరం పెట్టిన వాళ్లంతా ఈ బ్యూటీ చిక్కిపోయాక బాలీవుడ్ లో వరుసగా ఆఫర్లతో ముంచెస్తున్నారు. మరి ఇండస్ట్రీలో ఇంత క్రేజ్ సంపాదించుకున్న పరిణీతికి.. ప్రేమికుడు ఎవరైనా ఉన్నారా అనే ప్రశ్న ఎదురైంది. 'నేను చాలా ఓపెన్. చాలా రోజుల నుంచి ఒంటరిగానే ఉంటున్నాను. నా లైఫ్ లో ఎవరూ లేరు. నేను సినీరంగానికి చెందిన కొందరితో మాత్రమే టచ్ లో ఉంటా. మనసులో ఏదీ దాచుకునే అలవాటు లేదు. నాకు కాబోయే వాడు నాలానే ఉండాలని అనుకుంటున్నా' అంటూ చిలక పలుకులు పలికేసింది.

అసలు.. బ్యాండ్ బాజా బారాత్ దర్శకుడితో ఎఫైర్‌ ఉండటం కారణంగానే ఈ భామ పాప సినిమాల్లోకి వచ్చిందని.. అతడే పట్టుపట్టి తీసుకొచ్చాడనే రూమర్ బాలీవుడ్ లో గట్టిగానే వినిపిస్తుంది. ఈవిడ యాక్టర్ గా మారాక ఇద్దరూ బ్రేకప్ అయిపోయారనే టాక్‌ కూడా ఉంది. ఆ విషయం చెప్పకుండానే నేను ఓపన్ అంటే ఎలా పరిణీతి!!