Begin typing your search above and press return to search.

దానికి గిఫ్ట్ అనే పేరు పెట్టారు.. దురదృష్టకరం!

By:  Tupaki Desk   |   4 Aug 2019 1:26 PM GMT
దానికి గిఫ్ట్ అనే పేరు పెట్టారు.. దురదృష్టకరం!
X
సిద్ధార్థ్ మల్హోత్రా.. పరిణీతి చోప్రా హీరో హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ కామెడీ చిత్రం 'జబరియా జోడీ'. ఈ టైటిల్ కు అర్థం బలవంతపు జోడీ. సినిమా కాన్సెప్ట్ ఈ టైటిల్ లోనే ఉంది. బీహార్ లో యువకులను నిర్బంధించి గన్లతో బెదిరించి బలవంతంగా అమ్మాయిలతో పెళ్ళి జరిపించడమనేది సహజంగా జరిగే విషయం. దీన్ని పకడ్వా వివాహ్ అంటారు. ఈ థీమ్ తోనే 'జబరియా జోడీ' సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలలో భాగంగా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. కొన్ని సామాజిక సమస్యలపై తన అభిప్రాయాలను సూటిగా చెప్పింది.

కట్నం గురించి మాట్లాడుతూ "కట్నం తీసుకోవడం చట్టవ్యతిరేకం.. అనైతికం అని అందరికీ తెలుసు కానీ అందరూ దాన్ని ఫాలో అవుతారు. దానికి ఈమధ్య అందంగా 'గిఫ్ట్' అనే పేరు పెట్టడం నాకు కోపం తెప్పించే విషయం. మనం ఆధునికులం అనుకుంటాం.. కానీ ఇలాంటి పనులు చేయడం ఏంటి? మనం గొప్పగా కనిపించేందుకు అమ్మాయి కుటుంబాన్ని డబ్బు అడగడం.. విలాసవంతమైన వస్తువలను కొనివ్వమని కోరడం దురదృష్టకరం" అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది.

ఇంతటితో ఆగకుండా "కట్నం కారణంగా మరో ఈ బలవంతపు పెళ్ళి పుట్టుకొచ్చింది. ఇది కట్నానికి వ్యతిరేకం అన్నట్టు కనిపిస్తుంది కానీ మీరు ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్ళి చేయడం ఏరకంగా సమంజసం? "అంటూ ప్రశ్నించింది. ఈ కట్నం భూతాన్ని తరిమేయాలని... అమ్మాయి జీవితానికి వెల కట్టడం మానుకోవాలని అందరినీ కోరింది. ఈ కట్నాలు.. బలవంతపు వివాహాల పై అభిప్రాయాలు పక్కన పెట్టి పరిణీతి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే సైనా నెహ్వాల్ బయోపిక్.. 'ఎ గర్ల్ ఆన్ ది ట్రెయిన్' హిందీ రీమేక్ లైన్లో ఉన్నాయి.