Begin typing your search above and press return to search.
స్కూల్ గురించి సొల్లు చెప్పిందా??
By: Tupaki Desk | 30 May 2017 1:38 PM GMTబాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా.. ఈ మధ్యనే కొన్ని బీద అరుపులు అరిచింది. సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ యాన్యువల్ మీట్ కి హాజరైంది పరిణీతి. ఈ కార్యక్రమంలో భాగంగా స్టూడెంట్స్ తో మాట్లాడుతూ.. ప్రియాంక చోప్రా కజిన్స్ అయినా సరే.. తాము మధ్య తరగతి వారమే అని చెప్పింది ఈ భామ. చిన్నప్పుడు బోలెడన్ని కష్టాలు ఎదుర్కొన్నానని.. సైకిల్ తొక్కుకుంటూ స్కూల్ కి వెళ్లేదాన్నని.. కుర్రాళ్లు తన స్కర్ట్ పట్టుకుని లాగి వేధించేవారని చెప్పింది.
అయితే.. తాను పరిణీతి క్లాస్ మేట్ అని చెబుతున్న కన్నూ గుప్తా అనే వ్యక్తి.. ఈమె చెప్పిన మాటలను ఖండించాడు. తాను కూడా ముంబైలోని అంబాలాలో ఉన్న కాన్వెంట్ ఆఫ్ జీసెస్ అండ్ మేరీలోనే చదువుకున్నానని.. పరిణీతి చెబుతున్నట్లుగా ఆమెది పేద కుటుంబం కాదని.. అప్పట్లోనే ఆమె తండ్రికి కారు ఉండేదని పోస్ట్ చేశాడు. అంతే కాదు.. ఆ రోజుల్లో సైకిల్ పై స్కూల్ కు రావడం కూడా ఖరీదైన విషయమే అన్నది అతని వాదన. సెలబ్రిటీలు అంటే ఇలా కట్టు కబుర్లు చెప్పి సానుభూతి పొందేవాళ్లేనా అంటూ నిలదీశాడు కూడా.
అలాగే.. పరిణీతి ఇంటి పొరుగువాళ్లు కూడా ఆమె చెప్పినవన్నీ అబద్ధాలే అని తేల్చేశారు. అలాగే చిన్నప్పటి నుంచి ఆమె ఇలా వింతగా ప్రవర్తించేదని కూడా అంటున్నారు. ఇంతమంది తాను చెప్పిన వన్నీ అబద్ధాలే అంటున్నా సరే.. పరిణీతి చోప్రా మాత్రం కించిత్ కూడా ప్రతిస్పందించలేదు. పైగా ట్విస్ట్ ఏంటంటే.. ఆ ఎకౌంట్ ను ఆ పోస్టును సదరు వ్యక్తి కాసేపు ప్రపంచం అంతా చూసేశాక డిజేబుల్ చేసేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/