Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: వైట్ ఫ్రాక్ లో ముద్దు పాప

By:  Tupaki Desk   |   24 Feb 2016 4:53 AM GMT
ఫోటో స్టోరి: వైట్ ఫ్రాక్ లో ముద్దు పాప
X
పరిణీతి చోప్రా అంటే బొద్దుగా ఉండే నిండైన ముద్దుగుమ్మ గుర్తుకు రావడం ఖాయం. కానీ ఏడాది టైం తీసుకుని.. సెక్సీ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ లా మారిపోయింది. తన బాడీలో ప్రతీ పార్ట్ లోన మార్పు తెచ్చేసింది. ఇప్పుడు బాలీవుడ్ లో కుర్రకారును కట్టిపడేసే భామల్లో పరణీతి ప్లేస్ టాప్ లీగ్ లోనే వినిపిస్తోందంటే.. దానికి అమ్మడి అందంతో పాటు కమిట్ మెంట్ కూడా కారణం. ఇక బొద్దు అని ఈ భామను అనే అవకాశం ఎంతమాత్రం లేదనే విషయం స్పష్టమే.

యష్ రాజ్ ఫిలింగ్ బ్యానర్ లో 'మేరీ ప్యారీ బిందు'లో నటిస్తున్న పరిణీతి.. ఇప్పుడో షార్ట్ బ్రేక్ తీసుకుంది. తనకు అత్యంత ఇష్టమైన హాలిడే స్పాట్ అయిన ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తోంది. 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఇక్కడకు వచ్చిన పరిణీతి.. న్యూ క్వీన్స్ ల్యాండ్ లో చక్కర్లు కొడుతోంది. ఇక్కడకు వెళ్లడం కంటే.. ఈ ప్రాంతంలో వాటర్ స్పోర్ట్స్ ఆడుకుంటూ.. ఎంజాయ్ చేస్తూ అమ్మడు దిగిన ఫోటోలే ఎక్కువ హాట్ టాపిక్ అవుతున్నాయి.

వైట్ ఫ్రాక్ తో బీచ్ సైడ్ లో పరిణీతి చోప్రా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు.. ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పటివరకూ ఇంత అందంగా పరణీతి కనిపించలేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక్కడి రెస్టారెంట్స్ గురించి, తను తింటున్న ఫుడ్ గురించి, తను ఎంజాయ్ చేస్తున్న గురించి.. తెగ ట్వీట్స్ పెట్టేస్తోంది పరిణీతి.