Begin typing your search above and press return to search.

ఫిట్నెస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మారిందే

By:  Tupaki Desk   |   3 April 2017 4:30 AM GMT
ఫిట్నెస్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ గా మారిందే
X
ఒకప్పుడు పరిణీతి చోప్రా అంటే బొద్దు గుమ్మ. కానీ సడెన్ గా కెరీర్ బ్రేక్ ఇచ్చేసి.. ఫిట్నెస్ పై దృష్టి పెట్టేసి కళ్లు చెదిరేలా మేకోవర్ చేసేసింది ఈ బ్యూటీ. సెక్సీ లుక్స్.. బీచ్ ఫోటోలతో రచ్చ రచ్చ చేసేసి.. తను కోరుకున్న షేప్ లోకి వచ్చే వరకూ తెగ ఎక్సర్ సైజులు చేసేసింది. ఇప్పుడు అందానికే కాదు.. ఫిట్నెస్ కి కూడా కేరాఫ్ అడ్రస్ అయిపోయింది.

అందుకే తమ 13 వార్షికోత్సవ ప్రత్యేక ఎడిషన్ కు పరిణీతి చోప్రానే కవర్ పేజ్ గాళ్ గా ఎంచుకుంది ఏషియా స్పా మేగజైన్. ఒక హెల్త్ అండ్ వెల్ నెస్ మేగజైన్ కు ఇంత పర్ఫెక్ట్ గా మేకోవర్ చేసిన బ్యూటీ పరిణీతి కంటే స్పెషల్ పర్సన్ ను పట్టుకు రావడం కష్టం కదా. మేగజైన్ కవర్ పేజ్ పై అమ్మడు చూపించిన అందాలు చూస్తే మతి పోవాల్సిందే. క్రీమ్ కలర్ స్వెటర్ ను వేసుకుని క్లీవేజ్ షో చేస్తున్న పరిణీతి.. చూపరులకు కనువిందు చేసేస్తోంది. స్వెటర్ తో మాత్రమే కనిపిస్తున్నట్లుగా ఉన్న లుక్ అదరహో అనాల్సిందే.

ప్రస్తుతం ఈ భామ మేరీ ప్యారీ బిందు అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ అంతా పూర్తి చేసుకున్న ఈ మూవీ.. మే నెలలో రిలీజ్ కానుండగా.. మరోవైపు అజయ్ దేవగన్.. తుషార్ కపూర్ లతో కలిసి.. రోహిత్ శెట్టి తీస్తున్న గోల్ మాల్ ఎగైన్ లో కూడా నటించేయనుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/