Begin typing your search above and press return to search.

పారి త‌న హీరోనే పెళ్లాడుతోందా?

By:  Tupaki Desk   |   5 Sep 2018 1:30 AM GMT
పారి త‌న హీరోనే పెళ్లాడుతోందా?
X
పారి అలియాస్ ప‌రిణీతి చోప్రా అల్ల‌రి గురించి తెలిసిందే. అక్క పీసీ కాబోయేవాడైన‌ నిక్ జోనాస్‌ ని ఇండియాలో ఓ రేంజులో ఏడిపించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. దేశం కాని దేశం నుంచి తీపి గురుతులెన్నో మోసుకెళ్లాడు బ్రిట‌న్‌ బాబు. ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన న‌గ‌రం నుంచి అత‌గాడు ముంబైలో దిగిపోవ‌డం - అటుపై పీసీకి కంపెనీగా ప‌రిణీతి చోప్రా ఎస్కార్ట్‌ గా వెళ్ల‌డం - గోవా బీచ్‌ లో ఎంజాయ్ చేయ‌డం ప్ర‌తిదీ వాడి వేడిగా చ‌ర్చ‌కొచ్చాయి. రోకా ఈవెంట్ ముగిశాక ఇచ్చిన ఆతిధ్యంలో బావ‌గారి షూస్ దాచేసి ప‌రిణీతి చాలానే స‌ర‌స‌మాడింది.

పారిలోని ఈ కొత్త కోణం యూత్‌ ని ఆక‌ర్షించింది. ఇక‌పోతే ప‌రిణీతి న‌టించిన తాజా సినిమా `న‌మ‌స్తే ఇంగ్లండ్` త్వ‌ర‌లో రిలీజ్‌ కి రానుంది. ఆ క్ర‌మంలోనే ఈ అమ్మ‌డు ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో బిజీబిజీగా ఉంది. అర్జున్ క‌పూర్‌ తో పారి ఆన్‌ స్క్రీన్ రొమాన్స్‌ పైనా అభిమానులు ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. ప‌రిణీతి- అర్జున్ పెయిర్ బావుంది. రొమాన్స్ బావుంది. పెళ్లి చేసుకుంటారా? అంటూ ఫ్యాన్స్ ఒక‌టే ఆట‌ప‌ట్టిస్తున్నారు.

స‌రిగ్గా ఇదే టైమ్‌ లో పెళ్లి కాన్సెప్టుతో ప్ర‌ఖ్యాత బ్రైడ‌ల్ మ్యాగ‌జైన్‌ కి ప‌రిణీతి ఇచ్చిన ఫోజుల‌పైనా అంతే ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ప‌రిణీతి స్పెష‌ల్ వెడ్డింగ్ డ్రెస్‌ లో బుట్ట‌బొమ్మ‌లా మెరిసిపోతోంది. న‌వ‌వ‌ధువు అంద‌చందాల్ని గొప్ప‌గా ఎలివేట్ చేసింది క‌వ‌ర్‌ పేజీ. రాబోయే ప్రాణ స‌ఖుడి కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ.. క‌ల‌లుగంటున్న మ‌గువ‌గా క‌వ‌ర్‌ పేజీపై క‌నిపించింది.