Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సన్నబడిన విరజాజి

By:  Tupaki Desk   |   30 Jun 2015 7:30 PM GMT
ఫోటో స్టోరి: సన్నబడిన విరజాజి
X
సన్నజాజి, విరజాజి, విరిసిన విరిజల్లు.. ఇలాంటి వర్ణన సరిపోదేమో ఈ ముద్దుగుమ్మను చూస్తే. ఇంతలోనే ఎంత మార్పు? ఆవిడే ఈవిడా? అనిపించేంతటి మార్పు. రూపలావణ్యంలో నాజూకుతనం.. దాంతో పాటే రెట్టింపు సెగలు వచ్చి పడ్డాయ్‌. ఉన్నట్టుండి అరే ఇంత మార్పు ఎలా సాధ్యం? ఈ ఆర్నెళ్లలోనే ఈ రేంజులో ఎలా మారిపోయింది? సంతూర్‌ మమ్మీలా ఏదైనా మంత్ర దండం దొరికిందా? అని అంతా ఆశ్చర్యపోతున్నారు.

అంతే కాదండోయ్‌.. దేశంలో ఉన్న బొద్దుగుమ్మలంతా ఈ అమ్మడిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని సన్నబడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అంతేనా ఈ పరిణీతం ఎక్కడ దొరికినా ఆ సీక్రెట్‌ ఏంటో తెలుసుకోవాలని ఆత్రపడుతున్నారు. అసలింతకీ పరిణీతి చోప్రా ఏం చేసి ఇలా సన్నబడింది? దక్షిణాది బొద్దుగుమ్మ నమిత, ఉత్తరాది బొద్దందం సోనాక్షి .. వీళ్లలో రాని మార్పు ఈ అమ్మడిలో ఎలా సాధ్యమైంది? ఉన్నట్టుండి బెబో కరీనలా అయిపోయిందే. మలైకాలో మల్లె తీగలా మారిపోయింది.

ఈ సిరుల కోసం ఎంతగా కసరత్తులు చేసిందో? జిమ్ముకెళ్లి జిమ్మాయనమః అంటూ మంత్రం జపించడమే గాకుండా ఆహార నియమాల్ని అంతే బిగువుగా పాటించి ఉంటుంది. 26 ఏళ్ల పరిణీతి ఇటీవలే ఓ ఫిట్‌నెస్‌ మ్యాగజైన్‌ కవర్‌పేజీపై ఇలా ఫోజులిచ్చి ప్రపంచాన్ని షాక్‌కి గురి చేసింది. 90 కేజీల నిలువెత్తు శిల్పం 60కేజీలకు ఎలా పడిపోయిందబ్బా?