Begin typing your search above and press return to search.

ఈ లెవెల్లో కరిగిస్తే ఎవరైనా ఫ్లాటే

By:  Tupaki Desk   |   28 July 2015 6:01 AM GMT
ఈ లెవెల్లో కరిగిస్తే ఎవరైనా ఫ్లాటే
X
ఇండియాలో సైజ్ జీరోకి ఒక్కసారిగా క్రేజ్ తీసుకురావడమే కాదు... అసలా పదాన్ని మనకి పరిచయం చేసిన ఘనత... అందాల బెబోదే. బొద్దుగుమ్మ అనే బిరుదు నుంచి, నాజూకు అనే పదం కూడా సరిపోదనే స్థాయిలో ఆప్పట్లో చిక్కిపోయింది కరీనా కపూర్. చక్కనమ్మ చిక్కినా అందమే కదా.

కరీనా ఇంతలా షాక్ ఇచ్చిన తర్వాత... మళ్లీ ఎవరూ ట్రై చేయలేదు. కొందరు చేసినా సక్సెస్ కాలేదులెండి. కానీ... ఇప్పుడు ఛబ్బీ బ్యూటీ పరిణీతి చోప్రా... ఇదే ఫీట్‌ ను సాధించింది, అదీ రికార్డ్ టైంలో. హసీ తో ఫసీ, కిల్‌ దిల్ వంటి ఫ్లాప్‌ లు, వాటిలో తన లుక్‌ పై వచ్చిన విమర్శల తర్వాత.. ఈ హాట్‌ బ్యూటీ తనను తాను మార్చేసుకోవాలని డిసైడైంది. బాలీవుడ్‍‌ కు నచ్చేలా తన చుట్టుకొలతలను మార్చేసుకుని... నిర్మాతలు, దర్శకులను తన చుట్టూ తిరిగేలా చేయాలని ప్లాన్ చేసింది. ఇందుకోసం 6 నెలల పాటు బ్రేక్ తీసుకుని.. ఏకంగా పదిహేను కిలోలు కరిగించేసుకుంది. నున్నగా, నాజూగ్గా రూపొందిన న్యూలుక్‌ తో దిగిన ఫోటోలు చూస్తుంటే.. ఈ ముద్దుగుమ్మ, ఆ బొద్దు భామ ఒకరేనా అనిపిస్తోంది.

టాలీవుడ్‌ లో ఇలాంటి ఫీట్స్ అత్యంత అరుదు. చేయక చేయక ఇలియానా ఇలాంటి ప్రయత్నం చేస్తే.. పీనుగులా ఉందంటూ అందరూ తిట్టిపోశారు. అయితే... మరీ బాలీవుడ్ రేంజ్‌ లో జీరో సైజులు మనకు అవసరం లేదు కానీ... మరీ సినిమాకో రకంగా మారిపోతున్న మన హీరోయిన్లు.. వీరినుంచి ఏమైనా నేర్చుకుంటారా ? నోరు కట్టుకోకపోతే సరే... కనీసం కళ్లకు కనికట్టు చేసేట్టయినా కనిపించాలి కదా.