Begin typing your search above and press return to search.
సూపర్ స్టైలిష్ లుక్ లో మురిపిస్తున్న క్యాలెండర్ బ్యూటీ!
By: Tupaki Desk | 11 Jun 2020 3:00 PM GMTబాలీవుడ్ హీరోయిన్ పరిణితి చోప్రా అందరికి తెలిసే ఉంటుంది. ఇషక్ జాదే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఆ హిట్ తర్వాత అమ్మడికి వరుస ప్లాపులు ఎదురయ్యాయి. కెరీర్ ప్రారంభం కాబట్టి కాస్త ఇబ్బంది పడింది. కానీ ఆ సమయంలో పరిణితి శరీరాకృతి కూడా తను ఇబ్బంది పడటానికి ఒక కారణం. నిజం చెప్పాలంటే పరిణీతి లావుగా ఉండటంతో అవకాశాలు అంతగా రాలేదు. దీంతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బాగా డైట్ చేసి నడుము సైజును ఏకంగా 38 నుంచి 30కి తగ్గించేసింది. తను నాజూకుగా తయారయ్యానని చెప్పుకోవడానికి వరుసగా ఫోటో షూట్స్ చేస్తూ గుర్తుచేసింది. డైలీ డైట్ ఫాలో అవుతూనే తన అందాలను విందుగా ఆరబోసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస ఫోటోలు పెడుతూ తన డైట్ సీక్రెట్‌ను అభిమానులతో కూడా షేర్ చేసింది.
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో డబ్బూ రత్నాని క్యాలెండర్ కోసం ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోషూట్లో పరిణితి సూపర్ స్టైలిష్ బ్లాక్ దుస్తులలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పరిణీతి చోప్రా నలుపు రంగు దుస్తులలో దిగిన ఫోటోలలో సూపర్ ఫిట్‌గా కనిపించింది. ఆమె ఫోటోషూట్‌లో మ్యాచింగ్ టోపీతో పాటు లెథర్ జాకెట్ లో సూపర్ స్టైలిష్ గా ఫ్యాన్స్ కి కిక్కిస్తుంది. ప్రస్తుతం పరిణితి.. ది గర్ల్ ఆన్ ది ట్రైన్ సినిమాతో పాటు సైనా నెహ్వాల్ బయోపిక్ లో కూడా నటిస్తుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలన్నీ వచ్చే ఏడాది విడుదల కానున్నాయి. అయితే యశ్ రాజ్ సంస్థ పిఆర్వోగా కెరీర్ మొదలు పెట్టిన పరిణితి.. అదే సంస్థ నిర్మించిన లేడీస్ వర్సెస్ రిక్కీబెల్ తో హీరోయిన్ గా మారింది. మొదట్లో కాస్త బక్కగానే ఉన్న ఈ బ్యూటీ.. శుద్ధ్ దేశీ రొమాన్స్ సమయంలో బాగా బొద్దుగా మారిపోయింది. ప్రస్తుతం అమ్మడు విమర్శకులు ఆశ్చర్యపోయేలా మారిపోయింది.