Begin typing your search above and press return to search.

ఛాలెంజ్ చేసి హిట్టు చేశారు

By:  Tupaki Desk   |   13 April 2018 11:30 PM GMT
ఛాలెంజ్ చేసి హిట్టు చేశారు
X
పాట‌ల‌ను ఎలా హిట్టు చేయాలో బాలీవుడ్ జ‌నాల‌ని చూసి నేర్చుకోవాలి. మ‌నం ఒక్కో సింగిల్ చొప్పున విడుద‌ల చేస్తున్నా... జ‌నాల్లోకి స‌రిగా వెళ్ల‌డం లేదు. అయితే ఓ చిన్న ఛాలెంజ్ తో పాటకు విప‌రీత‌మైన పాపులారిటీ తీసుకొచ్చి సూప‌ర్ హిట్టు ఎలా చేయాలో చేసి మ‌రీ చూపిస్తోంది ‘హై జాక్’ చిత్ర బృందం. ఈ సినిమాలో ‘బెహ‌కా’ అంటూ మొద‌ల‌య్యే ఓ పాట ఉంది. దాన్ని ‘బెహ‌కా డ్రాప్ ఛాలెంజ్‌’ పేరుతో ఓ సరికొత్త విధానంలో ప్ర‌మోష‌న్ రూపొందించి... ఇన్ స్టంట్ హిట్టు చేసింది చిత్ర యూనిట్‌.

ఈ పాట‌లో వ‌చ్చే ఎల‌క్ట్రానిక్ బీట్ కి త‌గ్గట్టుగా స్టెప్పులేసి చూపించ‌మ‌ని ఓ చిన్న‌పాటి ఛాలెంజ్ చేసింది చిత్ర యూనిట్‌. అంతే ఒక్కోక్క‌రిగా బాలీవుడ్ తార‌లంతా ముందుకొచ్చారు. ముందుగా హీరోయిన్ ప‌ర‌ణీతి చోప్రా ఈ పాట‌లోని బీట్ కి త‌గ్గ‌ట్టుగా స్టెప్పులేస్తూ ఓ వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పెట్టింది. అది చూసి ముచ్చ‌ట ప‌డిన నుష్ ర‌త్ బ‌రుచా కూడా త‌న త‌ల్లితో క‌లిసి చిందేసి వీడియోను పోస్ట్ చేసింది. అలాగే మ‌ల‌యాళ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా స్నేహా త‌రాణితో కలిసి ఈ పాట‌కి చిందేశాడు. స్వ‌ర భాస్క‌ర్‌- శిఖా త‌ల్స‌నియా- మ‌ల్లికా దువా- ప్ర‌జ‌క్తా కోలి వంటి న‌టీన‌టులు కూడా ఈ ఛాలెంజ్ స్వీక‌రించి బీట్ కి త‌గ్గ‌ట్టుగా క్రేజీ స్టెప్పులేసి పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియోలు విప‌రీతంగా వైర‌ల్ అవుతూ ఈ ఛాలెంజ్ నూ- ఈ పాట‌నూ సూప‌ర్ హిట్ చేసేశాయి.

బంగారం కోసం విమానాన్ని హైజాక్ చేసి...అందులోని ప్ర‌యాణికుల‌తో అష్ట‌క‌ష్టాలు ప‌డే ఓ కుర్ర ముఠా క‌థే ఈ ‘హై జాక్’. సుమీత్ వ్యాస్.. మంత్ర‌.. సొనాలి సెగ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో రూపొందిన కామెడీ థ్రిల్ల‌ర్ మూవీ ‘హై జాక్’ ఏప్రిల్ 20న విడుద‌ల కాబోతోంది.

వీడియో ని చూడటానికి క్లిక్ చేయండి