Begin typing your search above and press return to search.

కాబోయే బావ వద్ద పరిణీతి 37 కోట్లు డిమాండ్‌

By:  Tupaki Desk   |   19 Oct 2018 10:35 AM GMT
కాబోయే బావ వద్ద పరిణీతి 37 కోట్లు డిమాండ్‌
X
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా వచ్చే నెలలో తన బాయ్‌ ఫ్రెండ్‌ నిక్‌ జొనాస్‌ ను పెళ్లి చేసుకునేందుకు సిద్దం అవుతున్న విషయం తెల్సిందే. రాజస్థాన్‌ లోని జోధ్‌ పూర్‌ లో వీరి వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయనే సమాచారం జరుగుతుంది. ఉత్తరాది వివాహ వేడుకల్లో ఎక్కువగా కనిపించే ఆట జూతా చురానా. ఈ ఆటలో భాగంగా వరుడి చెప్పుల జతను ఆయనకు వరుసకు మరదలు అయ్యే వారు దాచి పెడతారు. అప్పుడు వరుడు తన చెప్పులను కనిపెట్టుకోవాల్సి ఉంటుంది.

ఈ ఆటలో పాల్గొనే మరదళ్లకు బావలు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇక ప్రియాంక, నిక్‌ జొనాస్‌ వివాహంలో కూడా జూతా చురానా ఆడేందుకు తాము సిద్దం అవుతున్నట్లుగా హీరోయిన్‌ పరిణీతి చోప్రా తాజాగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మా బావ గారితో ఆడుకునేందుకు తాము సిద్దంగా ఉన్నామని, ఆయన నుండి అయిదు మిలియన్‌ డాలర్లను(రూ. 37 కోట్లు) వసూళ్లు చేయాలని భావిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఇప్పటికే ఈ విషయాన్ని ఆయనకు చెప్పగా - ఆయన మాత్రం కేవలం 10 డాలర్లు ఇస్తానన్నాడు.

ఇంకా చర్చలు జరుగుతున్నాయి, తాము మాత్రం అయిదు మిలియన్‌ డాలర్లు ఇచ్చే వరకు మా బావగారిని వదిలి పెట్టను - ఆయన తప్పకుండా నేను అడిగిన మొత్తాన్ని ఇస్తాడని ఆశిస్తున్నాను. ఎందుకంటే నేను ఆయనకు ప్రియమైన మరదల్ని కదా - తప్పకుండా ఆయన నేను అడిగిన మొత్తం ఇచ్చి - నన్ను సంతోష పెడతాడంటూ తన అక్క ప్రియాంక చోప్రా పెళ్లిలో చేయబోతున్న హంగామా గురించి పరిణీతి చోప్రా చెప్పుకొచ్చింది. ప్రియాంక, నిక్‌ ల వివాహం కోసం ఎంతో మంది బాలీవుడ్‌ ప్రముఖులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వీరి పెళ్లి అతి తక్కువ మంది గెస్ట్‌ ల మద్య వైభవంగా జరుగనున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.