Begin typing your search above and press return to search.

ఫొటో స్టోరీ : ఏంటి పరిణితి ఇలా చేశావ్‌?

By:  Tupaki Desk   |   1 Sep 2018 8:55 AM GMT
ఫొటో స్టోరీ : ఏంటి పరిణితి ఇలా చేశావ్‌?
X
బాలీవుడ్‌ స్టార్స్‌ ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్‌ తమ కాస్ట్యూమ్స్‌ మరియు మేకప్‌ - హెయిర్‌ డ్రసింగ్‌ విషయంలో చాలా జాగ్రత్తలు పడుతూ, ఎప్పుడు కూడా కొత్తగా కనిపించేలా, ఎప్పుడు అభిమానులను అలరించేలా కనిపించాలని కోరుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో కొన్ని సార్లు వారు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టడం - ప్రేక్షకులను మెప్పించాలనే ఉద్దేశ్యంతో చేసిన పని రివర్స్‌ అవ్వడం జరుగుతుంది. ఆమద్య ఒక హీరోయిన్‌ అందంగా కనిపించాలని ఆపరేషన్‌ చేయించుకుని అంద విహీనంగా తయారు అయింది. ఇప్పుడు అంతగా కాకుండా పరిణితి చేసిన పని రివర్స్‌ అయ్యింది.

అందంతో పాటు అభినంతో బాలీవుడ్‌లో తనకంటూ ఒక బ్రాండ్‌ను క్రియేట్‌ చేసుకున్న ముద్దుగుమ్మ పరిణితి చోప్రా. ఈ అమ్మడు బాలీవుడ్‌ లో వరుసగా భారీ చిత్రాల్లో నటిస్తూ స్టార్‌ హీరోయిన్‌ గా దూసుకు పోతుంది. తాజాగా ఈమె తన జుట్టును రెడ్‌ కలర్‌ లోకి మార్చుకుంది. ప్రస్తుతం పరిణితి చేస్తున్న హిందీ చిత్రం ‘జబారియా జోడీ’ కోసం ఇలా హెయిర్‌ను మార్చుకున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అయితే ఆమె ఫ్యాన్స్‌ మాత్రం కొత్త హెయిర్‌ కలర్‌ ను అంగీకరించడం లేదు.

సోషల్‌ మీడియాలో పరిణితి చోప్రా హెయిర్‌ కలర్‌ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పరిణితి స్కిన్‌ టోన్‌ కు ఆమె జట్టు కలర్‌ సెట్‌ కాలేదని - పరిణితి నువ్వు ఎందుకు ఇలా చేశావ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. హెయిర్‌ కలర్‌ ఈ చిత్రం వరకు అయితే పర్వాలేదు కాని మొత్తం ఇలాగే ఉంచుకోవడం ఏమాత్రం బాగోదు అంటూ ఆమె అభిమానులు అంటున్నారు.