Begin typing your search above and press return to search.
టాలీవుడ్ సెలబ్రిటీలకు ఫ్రెండ్లీ ప్లేస్
By: Tupaki Desk | 29 Aug 2015 10:40 PM GMTసెలబ్రిటీల ఇళ్లలో ఏ వేడుక జరిగినా అంగరంగ వైభవంగా ఉండాలి. రిచ్ లుక్ కావాలి. అసలు వాళ్లు సేద దీరాలంటేనే ఓ స్వర్గంలాంటి విడిది ఇల్లు కావాలి. ఏదైనా విందు, వినోద కార్యక్రమం చేయాలంటే 7స్టార్ ఏర్పాట్లు తప్పనిసరి. అది కూడా రద్ధీగా ఉండే రాజధాని నడిబొడ్డునే ఆ ఏర్పాట్లు కావాలి. ఎలా సాధ్యం? ఏదైనా ఔట్ స్కర్ట్స్ కి వెళ్లిపోదామంటే సమయం చిక్కదు. వ్యవహారాలన్నీ చక్కబెట్టుకోవాలంటే అంత దూరం వెళ్లి సిటీకి రావడం కుదరదు.
అందుకే ఎక్కువమంది టాలీవుడ్ సెలబ్రిటీలు ఇటీవలి కాలంలో నగరం నడిబొడ్డున ఉన్న 'పార్క్ హయత్' 7స్టార్ హోటల్ ని ఆశ్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో టాలీవుడ్ హీరోలంతా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తున్న హోటల్ ఇది. మొన్నటిరోజున చిరంజీవి షష్టి పూర్తి నుంచి సంతోషం అవార్డ్స్ వరకూ ఈ హోటల్ లోనే వేదిక ఏర్పాటు చేశారు. కీలకమైన ఆడియో ఫంక్షన్ లు, అవార్డుల మీటింగులు ఇక్కడ జరుగుతుంటాయి. చాలామంది స్టార్ హీరోలకు ఇందులో రూమ్ లు ఉన్నాయ్. ఏడాది కాంట్రాక్టులు కుదుర్చుకున్నారు. పూరీ జగన్నాథ్ స్క్రిప్టులు రాసేందుకు ఈ హోటల్ లోనే సిట్టింగులు వేస్తుంటాడు. త్రివిక్రమ్, వినాయక్ ఇలా అగ్రజులందరికీ ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయని చెబుతారు.
అయితే అంత కాస్ట్‌లీ హోటల్‌లో వీళ్ల పప్పులన్నీ ఎలా ఉడుకుతున్నాయ్? అన్న సందేహం వస్తే టి.సుబ్బిరామిరెడ్డి నయా స్కీమ్ వల్లేనని అనుకుంటున్నారంతా. టీఎస్సార్ కి సినీపరిశ్రమతో ఉన్న అనుబంధం వల్ల ఆయన డిస్కౌంట్ లు ఆఫర్ చేస్తున్నారు. తక్కువ ధరల్లోనే ఖరీదైన హోటల్ లో విలాసాలు. అందుకే మన సెలబ్రిటీలకు ఇది షరా మామూలు వ్యవహారమైపోయిందని అనుకుంటున్నారు. అదీ సంగతి.