Begin typing your search above and press return to search.
'ఫ్రీ పార్కింగ్' నుంచి థియేటర్లను మినహాయిస్తారా...?
By: Tupaki Desk | 16 Aug 2020 2:30 AM GMTకరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ కొన్ని కోట్ల మేర నష్టపోయింది. గత నాలుగున్నర నెలలుగా థియేటర్స్ మల్టీప్లెక్సెస్ మూతబడి ఉన్నాయి. దీంతో థియేటర్ ఓనర్స్ ఎగ్జిబిటర్లు తీవ్ర నష్టాలు చూస్తున్నారు. రోజురోజుకి కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే దాని మీద క్లారిటీ రావడం లేదు. ఒకవేళ ఫ్యూచర్ లో థియేటర్స్ తెరుచుకున్నా కొన్నాళ్లపాటు రెవిన్యూ నామమాత్రంగానే ఉండే అవకాశం ఉంది. అందువల్ల ఇప్పటి నుంచే నష్టనివారణ చర్యల గురించి ఆలోచిస్తున్నారట. దీనిలో భాగంగా పార్కింగ్ ఫీజులు మళ్ళీ వసూలు చేసే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించాలని నిర్ణయించుకున్నారట.
కాగా ఆస్పత్రులు, కమర్షియల్ కాంప్లెక్స్ లు, మాల్స్, సినిమా థియేటర్ల వద్ద పార్కింగ్ ఫీజులు వసూలు చేయడానికి వీళ్లేదని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమా థియేటర్ల వద్ద పార్కింగ్ ఫీజును వసూలు చేయడం లేదు. అయితే ఇప్పుడు ఎంతో కొంత నష్టాల నుండి బయటపడటానికి మళ్ళీ పాత పద్ధతిని తీసుకురావాలని కోరుతున్నారట. గతంలో 'ఫ్రీ పార్కింగ్' రూల్ తెచ్చినప్పుడు.. 'పార్కింగ్ ఫీజులను ఎత్తేయడంతో థియేటర్లలో ప్రజల వాహనాలకు భద్రత కరువైందని.. పార్కింగ్ ఛార్జీలకు సంబంధించి ప్రభుత్వమే ఒక రేటును నిర్ణయించి అన్ని థియేటర్లలో అదే రేటును అమలు చేసేలా చూడాలని' థియేటర్స్ ఓనర్స్ మరియు ఎగ్జిబిటర్లు ప్రభుత్వాన్ని కోరాయి.
అంతేకాకుండా థియేటర్లపై నియంత్రణ పెంచి అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని.. ఎక్కువ ఛార్జీలు పెట్టినవారితో పాటు తక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్న వారికి కూడా ఒకే శిక్ష వేయడం సరికాదని ప్రభుత్వంతో ఇండస్ట్రీ పెద్దలు ఎగ్జిబిటర్లు చర్చలు జరిపారు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో తాజాగా మరోసారి ఇలాంటి ప్రతిపాదనలతో ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారట. మరి రాబోయే రోజుల్లో 'ఫ్రీ పార్కింగ్' నుంచి థియేటర్లను మినహాయించడంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.