Begin typing your search above and press return to search.

ప‌రిష్క‌రించ‌క‌పోతేనా.. డిస్ట్రిబ్యూట‌ర్ల పూన‌కం..?

By:  Tupaki Desk   |   4 March 2021 4:30 AM GMT
ప‌రిష్క‌రించ‌క‌పోతేనా.. డిస్ట్రిబ్యూట‌ర్ల పూన‌కం..?
X
క‌రోనా క్రైసిస్ అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌తో పాటు టాలీవుడ్ ని పెద్ద దెబ్బ కొట్టింది. అయితే లాక్ డౌన్ తొల‌గించాక‌.. నెమ్మ‌దిగా ప‌రిస్థితులు స‌ద్ధుమ‌ణుగుతున్న వేళ తిరిగి థియేట‌ర్లు తెరుచుకోవ‌డంతో టాలీవుడ్ కి కొత్త క‌ళ వ‌చ్చింది. వ‌ర‌స‌గా సినిమాలు రిలీజ‌వుతున్నాయి. జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. దీంతో బాక్సాఫీస్ నిండుకుండ‌లా మురిపించేస్తోంది. అయితే ఇలాంటి స‌మ‌యంలో పంపిణీ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేగింది.

గ‌డిచిన తొమ్మిది నెల‌ల కాలంలో త‌మ‌కు తీవ్ర న‌ష్టం త‌ప్ప‌లేద‌ని.. అయితే దానికి ప్ర‌భుత్వ‌మే ప‌రిష్కారం చూపాల‌ని తెలంగాణ పంపిణీదారుల ఎగ్జిబిట‌ర్ల సంఘాలు కోరుతున్నాయి. ఇప్పుడు వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తులు ఉన్నా.. గ‌త న‌ష్టాల్ని పూడ్చాలంటే తెలంగాణ ప్ర‌భుత్వమే క్రైసిస్ కాలంలోని క‌రెంటు బిల్లుల్ని రద్దు చేసి.. పార్కింగ్ ఫీజుల‌కు ఇప్పుడు అనుమ‌తించాల‌ని తాజా స‌మావేశంలో కోరారు.

తెలంగాణా ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో తెలంగాణా ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న అన్ని జిల్లాల డిస్ట్రిబ్యూటర్లు త‌మ‌ డిమాండ్లను తెర‌పైకి తేవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ స‌మావేశంలోనే టిక్కెట్టు ధ‌ర పెంపు విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. అదనంగా షో లు ప్రదర్శించేందుకు డిసెంబర్ లో ఇచ్చిన జీవోను వెంటనే అమల్లోకి తేవాలని టీ-పంపిణీ వ‌ర్గాలు కోరుతున్నాయి. తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రెటరీ సునీల్ నారంగ్- ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సెక్రెటరీ విజయేందర్ రెడ్డి- తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ మురళి మోహన్ స‌మ‌క్షంలో పంపిణీ-ఎగ్జిబిష‌న్ వ‌ర్గా‌లు పెద్ద ఎత్తున పాల్గొన‌గా ఎవ‌రి స‌మ‌స్య‌లు వారు విన్న‌వించారు.

అయితే పార్కింగ్ ఫీజు పేరుతో గంట గంట‌కు బాదుడుతో ప్ర‌జ‌లు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నార‌ని తెలంగాణ ప్ర‌భుత్వం మాల్స్ మ‌ల్టీప్లెక్సులు థియేట‌ర్ల‌లో పార్కింగ్ ఫీజుల్ని ర‌ద్దు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికీ థియేట‌ర్ల‌లో తినుబండారాల‌కు ధ‌ర‌ల ప‌ట్టిక స‌రిగా క‌నిపించ‌దు. ప‌న్ను బాదుడు మిన‌హాయింపులు ఉండ‌వు. వీట‌న్నిటిపైనా ప్ర‌జ‌ల్లో నిరంత‌రం చ‌ర్చ సాగుతోంది. అయితే 9 నెల‌ల క్రైసిస్ ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్ర‌భుత్వం వెసులుబాటు క‌ల్పిస్తుందా? అన్న‌ది చూడాలి. మ‌రోవైపు ఏపీలో క్రైసిస్ డేస్ థియేట‌ర్ల‌లో క‌రెంటు బిల్లుల మాఫీకి ప్ర‌భుత్వం అంగీక‌రించిన సంగ‌తి తెలిసిందే. ఎగ్జిబిట‌ర్ ఫ్రెండ్లీగా ఏపీ ప్ర‌భుత్వం ఉండ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.