Begin typing your search above and press return to search.

మహేష్ దర్శకుడికి సీనియర్ల సాయం

By:  Tupaki Desk   |   6 March 2016 6:00 AM GMT
మహేష్ దర్శకుడికి సీనియర్ల సాయం
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న బ్రహ్మోత్సవం.. చాలా నెమ్మదిగా షూటింగ్ జరుపుకుంటున్న మాట తెలిసిందే. మొదట సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసి, తర్వాత ఏప్రిల్ అని.. ఇప్పుడు మే 31కి అని విడుదల తేదీలు వాయిదా వేస్తూనే ఉన్నారు. దీనికి కారణం.. స్టోరీ ఎలివేషన్ తోపాటు, అనేక సీన్స్ విషయంలో మహేష్ కు, డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలకు వస్తున్న విబేధాలే కారణమనే టాక్ వినిపిస్తోంది.

స్టోరీ లైన్ - టైటిల్ తోనే మూవీ స్టార్ట్ చేసేశాడట శ్రీకాంత్ అడ్డాల. ఫుల్ స్క్రిప్ట్ చేతిలో లేకపోవడంతో.. అసలేం చెప్పావ్, ఏం తీస్తున్నావ్ అంటూ మహేష్ కస్సుబుస్సులాడాడని కూడా టాక్ వినిపించింది. మధ్యలో కొన్నాళ్లు షూటింగ్ ఆపేసి.. సీన్స్ ను రీరైట్ చేయించాడని అంటున్నారు. నిర్మాత పీవీపీ ఈ సిట్యుయేషన్ ని సరిదిద్దడానికి రాఘవేంద్రరావును సంప్రదించగా.. ఆయన సలహాతో పరుచూరి సోదరులు రంగప్రవేశం చేశారట.

వారి సూచనల మేరకు స్క్రిప్టులో మార్పులు చేర్పుల తర్వాతే మళ్లీ బ్రహ్మోత్సవం బండి పట్టాలెక్కిందని తెలుస్తోంది. మహేష్ మూవీ ఇంత లేట్ కావడానికి కారణం ఇదే నని చెప్పుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన మహేష్ ఫ్యాన్స్.. శ్రీకాంత్ అడ్డాలపై చిర్రుబుర్రులాడుతున్నారు.