Begin typing your search above and press return to search.
చిరు 150: పాత సెంటర్ లోకి వచ్చేసింది
By: Tupaki Desk | 10 Dec 2015 5:30 PM GMTమెగాస్టార్ చిరంజీవి రీ-ఎంట్రీ ఫిలిం ఎప్పుడో తెలియదు కాని.. ఆ సినిమా వచ్చే వరకు అభిమానులు మాత్రం కళ్లలో ఎల్.ఈ.డి. లైట్లు వేసుకొని ఎదురు చూడాల్సిందే. అయితే ఈ సో కాల్డ్ 150వ చిత్రం ఇప్పుడు అన్ని మలుపులూ తిరిగి.. చివరకు ఎక్కడ మొదలైందో అక్కడే ఆగేలా ఉంది.
నిజానికి అప్పట్లో 150వ సినిమా బాధ్యతలన్నీ ఇద్దరి మీద పెట్టారు చిరంజీవి. ఒకటి రచయితల ద్వయం పరుచూరి బ్రదర్స్ అయితే, రెండవది దర్శకుడు వినాయక్. పరుచూరి వారి కలం నుండి వచ్చిన కథను వినాయక్ డైరక్షన్ లో చేస్తారని అప్పట్లో వినిపించేది. అందుకు తగ్గట్టుగానే వారు కూడా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథను తయారుచేసి ఇచ్చారు. అయితే.. ఈ కథను ఎందుకో చిరంజీవి పక్కనెట్టేసి... పూరి జగన్ తో ఆటో జానీ అని.. లేకపోతే హరీశ్ శంకర్ వంటి దర్శకులు కథతో వచ్చినా సరే అంటూ చాలా ప్రయత్నాలే చేసి చివరకు తిరిగితిరిగి పాత సెంటర్ కే మళ్లీ వచ్చేశారు.
ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఇప్పుడు పరుచూరి వారు మరో కొత్త కథను చిరంజీవి కోసం వండి వార్చారట. ఈ కథను డైరక్టు చేసేది వినాయక్ వారే. మరి దీనినే 150వ సినిమాగా చేస్తారా అనే విషయం మాత్రం తెలియదు.