Begin typing your search above and press return to search.

ఆ డైలాగ్ విని చిరు ఫిదా అయ్యాడు

By:  Tupaki Desk   |   25 March 2018 4:22 PM IST
ఆ డైలాగ్ విని చిరు ఫిదా అయ్యాడు
X
‘మగధీర’ లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ‘ఆరెంజ్’ లాంటి డిజాస్టర్‌ తో కుదేలైపోయాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దాని తర్వాత ఎలాంటి సినిమా చేయాలో తెలియని సందిగ్ధంలో ఉండగా.. ‘ఏమైంది ఈవేళ’ లాంటి చిన్న సినిమా తీసిన సంపత్ నంది అతడిని మెప్పించాడు. ‘రచ్చ’ సినిమా చేశాడు. ఐతే సంపత్ బ్యాగ్రౌండ్ ప్రకారం చూస్తే చిరంజీవి ‘రచ్చ’కు ఓకే చెప్పడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే అతను కొత్త దర్శకుడు కదా.. అనుభవజ్ఞుల సాయం అవసరం అని భావించి పరుచూరి సోదరులతో స్క్రిప్టు ఓకే చేయించుకుని.. వారితోనే ఈ చిత్రానికి మాటలు రాయించుకోమని చిరు చెప్పాడట. కానీ సంపత్ అందుకు సుముఖంగా కనిపించలేదట.

ఐతే చిరు మాటను కాదంటే సినిమా పోతుందని భావించి పరుచూరి సోదరుల్ని కలవగా.. వాళ్లు సంపత్ కన్విన్స్ అయ్యేలా స్క్రిప్టులో మార్పులు చేర్పులు చేసి.. డైలాగులు రాశారట. ఆ సినిమాలో చరణ్ ఒక సీన్లో ‘‘నువ్వు అరిస్తే అరుపులే.. నేను అరిస్తే మెరుపులే’’ అంటూ ఒక పవర్ ఫుల్ డైలాగ్ కొడతాడు. ఆ డైలాగ్ విని చిరు ఫిదా అయిపోయాడట. ‘‘చూశావా నేనెందుకు పరుచూరి సోదరుల దగ్గరికి వెళ్లమన్నానో’’ అంటూ సంపత్ తో చిరు అన్నాడట. ఈ విషయాన్న పరుచూరి గోపాలకృష్ణ తాను నిర్వహిస్తున్న ‘పరుచూరి పాఠాలు’ కార్యక్రమంలో భాగంగా వెల్లడించాడు. చరణ్ తో తాము చేసిన తలి సినిమా ‘రచ్చ’నే అని.. అది పెద్ద హిట్టయిందని.. ఆ తర్వాత అతడితో చేసిన ‘గోవిందుడు అందరివాడేలే’ పర్వాలేదనిపించిందని.. ఐతే ఆ చిత్రం చరణ్ ఇమేజ్ కు తగ్గట్లుగా లేకపోవడంతో ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేకపోయిందని ఆయనన్నారు.