Begin typing your search above and press return to search.

మెగా రైటర్స్ వాళ్లే.. మిగతావన్నీ కబుర్లే

By:  Tupaki Desk   |   19 Aug 2016 9:26 AM GMT
మెగా రైటర్స్ వాళ్లే.. మిగతావన్నీ కబుర్లే
X
చిరంజీవి 150వ సినిమాకి మొదటి పోస్టర్ పడిపోయింది. ఫస్ట్ లుక్ కి ప్రీ రిలీజ్ పోస్టర్ గా విడుదల చేయగా.. ఇందులో నోట్ చేయాల్సిన మెయిన్ పాయింట్ రైటర్ క్రెడిట్స్. ఈ పోస్టర్ లో పరుచూరి బ్రదర్స్ పేర్లు మాత్రమే కనిపిస్తున్నాయి. కోలీవుడ్ కత్తికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి.. రైటర్లుగా చాలామంది పేర్లే వినిపించాయి.

చిరు150 కి మురుగదాస్ స్టోరీ కాగా.. రైటర్స్ గా పరుచూరి బ్రదర్స్ ను ముందే తీసుకున్నారు. అయితే.. డైలాగ్స్ లో పంచ్.. పదును పెంచడం కోసం వేరే రచయితల సహకారం తీసుకున్నారనే టాక్ బాగానే వినిపించాయి. పరుచూరి సోదరులకు ఆకుల శివ.. కంచె ఫేమ్ సాయిమాధవ్ బుర్రాలు సహాయం చేశారని.. అందరు కలిసి కత్తి పదును బాగా పెంచారని అన్నారు. వీరితో పాటు ఓ కీలకమైన సన్నివేశం కోసం త్రివిక్రమ్ ని కూడా డైలాగ్స్ రాయమన్నారనే టాక్ వినిపించింది.

ఇప్పుడు మెగా 150కి ఫస్ట్ పోస్టర్ చూస్తే.. రైటర్స్ గా క్రెడిట్స్ కేవలం పరుచూరి సోదరులకు మాత్రమే దక్కనుంది. అంటే మెగా రైటర్స్ వాళ్లు మాత్రమే అనే విషయంపై క్లారిటీ వచ్చేసింది. మిగిలినవన్నీ అత్యుత్సాహంతో కొందరు చేసిన గాసిప్స్ అని అనేసుకోవచ్చు.