Begin typing your search above and press return to search.

కేజీఎఫ్ క‌థ మెగాస్టార్ కి రాసిన‌దే!!

By:  Tupaki Desk   |   11 March 2019 4:33 PM GMT
కేజీఎఫ్ క‌థ మెగాస్టార్ కి రాసిన‌దే!!
X
బాహుబ‌లి సిరీస్ త‌ర్వాత సౌత్ నుంచి అంత‌గా పాపులారిటీ సంపాదించిన సినిమాగా కేజీఎఫ్ గురించి చెప్పుకుంటున్నారంతా. ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 250 కోట్ల గ్రాస్ వ‌సూలు చేయ‌డం ఓ సంచ‌ల‌నం. క‌న్న‌డ‌, హిందీలో బంప‌ర్ హిట్ కొట్టింది. తెలుగులోనూ ఫ‌ర్వాలేద‌నిపించే వ‌సూళ్ల‌తో మెప్పించింది. అందుకే ఇప్ప‌టికీ కేజీఎఫ్ గురించి అన్నిచోట్లా ఆస‌క్తిగా మాట్లాడుకుంటున్నారు. బాహుబ‌లి త‌ర్వాత సౌత్ లో ఎన్ని భారీ ప్ర‌య‌త్నాలు చేసినా అన్నీ విఫ‌ల‌య‌మ్యాయి. కానీ క‌న్న‌డ సినిమా గౌర‌వాన్ని పెంచ‌డంలో కేజీఎఫ్ కీల‌క పాత్ర పోషించింది. అంత గొప్ప‌త‌నం ఈ సినిమాలో ఏం ఉంది? అంటే కేజీఎఫ్ క‌థాంశం యూనిక్ అని చెప్పుకునేంత ఏమీ లేద‌ని ఖండిస్తున్నారు ప‌రుచూరి సోద‌రుల్లో మాట‌కారి అయిన గోపాల‌కృష్ణ‌.

ఆయ‌న `ప‌రుచూరి పాఠాలు`(యూట్యూబ్‌)లో భాగంగా లెవంత్ అవ‌ర్ డిస్క‌ష‌న్స్ లో కేజీఎఫ్ క‌థ గురించి విశ్లేషించిన తీరు ఆక‌ట్టుకుంది. కేజీఎఫ్ క‌థాంశం విశ్లేషించాలి అంటే లెవంత్ అవ‌ర్ లో ఒకే ఒక్క సంగ‌తి చెప్పాలి. అమ్మ తాను చ‌నిపోయే ముందు కొడుకు ఇచ్చిన ప్రామిస్ ఎలా నిల‌బెట్టుకున్నాడు? అన్న‌దే ఈ సినిమా క‌థాంశం. ఈ చిత్రం 160 కోట్ల షేర్ వ‌సూలు చేసింది అంటే.. గ‌మ‌నిస్తే చాలా చిన్న ఆత్మ ఉంది ఈ చిత్రంలో. ఎంత‌ జాగ్ర‌త్త తీసుకున్నార‌న్న‌ది ఆస‌క్తిక‌రం. అయితే ఈ సినిమాలో లైన్ గురించి మేం ఇదివ‌ర‌కూ రాశాం. బంగారు గ‌నుల నేప‌థ్యంలో గిరిజ‌నుల క‌థ‌తో రాసుకున్న సినిమానే కొండ‌వీటి దొంగ‌. చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టించారు. అడ‌విలో బంగారు గ‌నులు ఉన్నాయి. ఆ సంగ‌తి బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌కుండా పులి చంపేస్తోంది! టైగ‌ర్ జోన్‌!! అన్న ట్రామా క్రియేట్ చేశాం ఆ క‌థ‌లో. అక్క‌డ క‌లెక్టర్ అవ్వాల్సిన కుర్రాడు దొంగ అయ్యాడు అని క‌థ రాసుకున్నాం.

ఇక కేజీఎఫ్ క‌థ‌లో ఒక పేద‌రాలి క‌డుపున పుట్టిన బిడ్డను రాజు కావాల‌ని త‌ల్లి కోరుతుంది. ఎవ‌డూ కానంత శ్రీ‌మంతుడివి కావాల‌ని త‌ల్లి కోరుతుంది. అది రైట‌ర్ & డైరెక్ట‌ర్ పాయింట్ లో చాలా గొప్ప పాయింట్. 14 వ‌య‌సులోనే ఆ పిల్లాడికి ఓ మోటివ్ ని క్రియేట్ చేశారు. అమ్మ రాజు అవ్వ‌మంది. కానీ అత‌డు ఏమ‌నుకుంటున్నాడు? ఒక ప్ర‌పంచానికి చ‌క్ర‌వ‌ర్తి కావాల‌నుకుంటున్నాడు. అదే ఎమోష‌న్ కి కార‌ణ‌మైంది. ఆ సినిమాలో 10-15 చోట్ల అద్భుత‌మైన డైలాగుల్ని క‌థ మూవ్ మెంట్ కి, పాత్ర చిత్ర‌ణ‌కు ఉప‌యోగ‌ప‌డ్డాయి. ప్ర‌థ‌మ పురుష దృష్టి కోణంలో ఈ చిత్రానికి క‌థ రాసుకున్నారు.. అని కొన్ని కిటుకుల్ని అద్భుతంగా చెప్పారు ప‌రుచూరి. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ అని వాళ్లు చెబితే.. కింగ్ ఆఫ్ గోల్డెన్ ఫ్యాక్ష‌నిస్ట్ అనేది నా కోణం. ఒక మాఫియాని హీరో చంపేయాల‌నేది ప్రేక్ష‌కుడి దృష్టి కోణం అనుకుంటే, ఆ హీరోని చంపేయాల‌నేది ప్ర‌ధాని కోణంలో ఉంటుంది.. ఇక మేం అడ‌వి దొంగ కోసం ఒక అడ‌వి .. గిరిజ‌నులు.. క‌ష్టాల గురించి మేం రాసుకుంటే.. ఒక మాఫియా గురించి .. బానిస‌త్వం గురించి హీరోని హైలైట్ చేసేలా క‌థ రాసుకున్నారు అని విశ్లేషించారు.

అన‌గ‌న‌గా ఓ పిల్లాడు స్ల‌మ్ లోంచి వ‌చ్చి దొరికిన వాళ్లంద‌రినీ కొట్టుకుని వెళుతూ ఒక మైన్స్ లో డాన్ ని కొట్టేశాడు! అని కూడా కేజీఎఫ్ క‌థ‌ను చెప్పొచ్చు అంటూ ర‌క‌ర‌కాల కోణాల్లో ప‌రుచూరి త‌న‌దైన అనుభ‌వంతో విశ్లేషించిన తీరు ప్ర‌శంస‌నీయం. దాదాపు 30 కోణాల్లో కేజీఎఫ్ క‌థ‌ని ప‌రుచూరి మాష్టారు అద్భుతంగా విశ్లేషించారు. కేజీఎఫ్ లో ఫైట్ చేయకుండా పెట్రోల్ పోసి వెలిగించి తెలివిగా ఎంపిక చేసుకున్న యాక్ష‌న్ గొప్ప‌గా ఉంద‌ని పొగిడేశారు. అర‌వింద .. గీత గోవిందం క‌థ‌ల్లోనూ ప్ర‌థ‌మ పురుష కోణం ఉంటుంది అని క‌నెక్ష‌న్ పాయింట్ చెప్పారు. ప్ర‌పంచంలోనే ఏ మాష్టారూ విశ్లేషించ‌నంత‌గా తెలుగు వారికి అర్థ‌మ‌య్యేలా ప‌రుచూరి పాఠాలు ఆక‌ట్టుకుంటున్నాయి. ఉస్మానియాలోనూ ఆయ‌న సినిమా పాఠాలు చెప్పేంత గొప్ప మాస్టారు అయ్యింది ఇందుకే.