Begin typing your search above and press return to search.
పెదనానా అనొచ్చా అని ఎన్టీఆర్ అడిగాడు
By: Tupaki Desk | 15 March 2018 12:19 PM GMTదాదాపు 350 సినిమాలకు రచయితలుగా పని చేసిన అనుభవం పరుచూరి సోదరులది. ఇప్పుడు వాళ్లు సినిమాలు తగ్గించేశారు. ఐతే తమ విలువైన అనుభవాల్ని జనాలతో పంచుకోవాలన్న ఉద్దేశంతో ‘పరుచూరి పాఠాలు’ పేరుతో గోపాలకృష్ణ యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన ఆసక్తికర సంఘటనల్ని అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ కమిట్మెంట్.. అతడితో తన అనుబంధం గురించి ఆయన ఒక ఉదాహరణ చెప్పారు.
‘ఆది’ సినిమా కోసం డైలాగులు రాయమని నిర్మాత నాగలక్ష్మి తమను అడిగిందని.. ఐతే తాను కుదరదని చెప్పడంతో నిరాశగా వెళ్లిపోయిందని.. ఐతే తాము తర్వాత వీలు చూసుకుని ఆ సినిమాకు మాటలు రాశామని గోపాలకృష్ణ వెల్లడించారు. ఐతే ఈ సినిమా డైలాగులు చదివాక ఇది నందమూరి బాలకృష్ణకు రాసినట్లుందని తన కుమార్తె చెప్పగా.. నందమూరి కుటుంబంలో ఎవరికైనా ఈ డైలాగులు సూటవుతాయని తాను అన్నానని.. అన్నట్లుగానే ఆ సినిమాలో ఎన్టీఆర్ కు డైలాగులు బాగా కుదిరాయని ఆయన చెప్పారు.
ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ఎన్టీఆర్ చేతికి గాయం అయిందని.. అప్పుడు తాను ఫోన్ చేసి షూటింగ్ ఆగిపోయిందా అని అడిగితే.. అదేమీ లేదని.. తారక్ గాయంతోనే షూటింగ్ లో పాల్గొంటున్నాడని చెప్పగానే తనకు సీనియర్ ఎన్టీఆర్ గుర్తుకొచ్చారని.. ఆయన కూడా ‘తాండ్ర పాపారాయుడు’ షూటింగ్ సందర్భంగా చేతికి గాయం అయితే అలాగే షూటింగులో పాల్గొన్నారని పరుచూరి గుర్తు చేసుకున్నారు. ‘ఆది’ సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ తన దగ్గరికి వచ్చి మిమ్మిల్ని పెదనాన్నా అని సంబోధించవచ్చా అని అనుమతి అడిగాడని.. ఆ మాటతో తనకు కళ్లలో నీళ్లు తిరిగాయని.. తాను సరే అంటే ప్రెస్ మీట్లోనే కాక.. ఆ తర్వాత కూడా తనను పెదనాన్నా అనే తారక్ సంబోధిస్తున్నాడని పరుచూరి వెల్లడించారు.