Begin typing your search above and press return to search.
పరుచూరి పాజిటివ్ పంచ్ లు
By: Tupaki Desk | 4 Oct 2017 10:38 AM GMTఒక సినిమా హిట్ అయినా కూడా ప్రస్తుత రోజుల్లో నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వందమందికి నచ్చిన సినిమా ఒక్కరికి నచ్చకపోవచ్చు. ప్రతి సినిమా అందరికి నచ్చేలా తీయాలని రూల్ ఏమి లేదు. దర్శకులు వారు ప్రతిభను బట్టి సినిమాను తెరకెక్కిస్తారు. కానీ సినిమాలో ఉన్న అసలు విషయాన్ని పట్టించుకోకుండా ఎదో లేదు అనేలా రివ్యూలు రాస్తున్నారని కొందరు సినీ ప్రముఖులకు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో సినిమా రివ్యూలపై తారలు కొంచెం గట్టిగానే స్పందిస్తున్నారు. రీసెంట్ గా సీనియర్ రచయిత - దర్శకులు పరుచూరి గోపాల కృష్ణ కూడా రివ్యూలపై స్పందించారు. అయితే ఆయన అందరిలా కాకుండా తనదైన శైలిలో స్పందించారు. ఓ వైపు పాజిటివ్ గా స్పందిస్తూనే పంచ్ లు వేశారు. అయన మాట్లాడుతూ.. ''చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన ఖైదీ సినిమాపై ఒక సమీక్షకుడు "ద్వితీయార్థం లో అడవి పాలైన ఖైదీ” అని హెడ్డింగ్ పెట్టాడు. ఇక 19 సినిమాల తర్వాత ఎమ్మెస్ రెడ్డి గారు పల్నాటి సింహం తో చాలా పెద్ద హిట్ అందుకున్నారు. కానీ ఆ సినిమా రివ్యూకి “కత్తి పట్టబోయి సుత్తి పట్టిన పల్నాటి సింహం” అని టైటిల్ పెట్టేశారు. అయితే ఇలాంటి తరహా సమీక్షలు ఎన్నో వచ్చాయి. కానీ తాము ఏనాడూ తప్పుగా మాట్లాడలేదని వివరిస్తూ.. ఈ దేశం లో వాక్ స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం ఉన్నాయని'' అన్నారు.
ఇక కొత్తదనంతో కూడిన సినిమాలను కూడా కొత్తదనం లేదు అనేలా రివ్యూలు వచ్చాయని వివరించారు. 1987లో ఒక కొత్త పాయింట్ తో ప్రజా స్వామ్యం అనే కథ రాశాం. సినిమా కూడా అప్పట్లో మంచి ఆదరణను దక్కించుకుంది. ఒక ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేని ఒక వ్యక్తి ఢిల్లీ వెళ్లి రాజ్య సభ సభ్యుడిగా మంత్రిగా బాధ్యతలను దక్కించుకుంటాడు. ఆ కొత్త తరహా కథ అందరికి నచ్చింది. ప్రజలు మెచ్చలేని నాయకుడు ఆ బాధ్యతలను దక్కించుకున్నాడు. ప్రజాస్వామ్యం ఉన్నట్లా లేనట్లా ? అని ఒక కొత్త కథ. అప్పటివరకు ఆ తరహాలో ఏ సినిమా రాలేదు. కానీ దానిపై “కొత్తదనం లేని ప్రజాస్వామ్యం” అని రివ్యూ రైటర్ హెడ్డింగ్ పెట్టాడు. అలాగే 300 రోజులు ఆడిన సినిమాలకు కూడా ఇదే తరహాలో రివ్యూలు ఇచ్చారని పరుచూరి కామెంట్స్ చేశారు.