Begin typing your search above and press return to search.
ఆత్రేయ పరిస్థితి కన్నీళ్లు పెట్టించిందట!
By: Tupaki Desk | 5 May 2021 11:30 AM GMTఆత్రేయ మాటలు మనసు లోతులను తాకుతాయి .. ఆయన పాటలు వేదాంత రహస్యాలను వెలికితీస్తాయి. జీవితం ఎలా నడిపిస్తుందో .. ఎలా మురిపిస్తుందో .. ఎలా ఏడిపిస్తుందో తన పాటల్లో ఆయన గొప్పగా ఆవిష్కరించారు. అయితే పాటలు రాయడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకునేవారు. అందుకే ఆయన రాయక నిర్మాతలను .. రాసి ప్ర్రేక్షకులను ఏడిపిస్తారు అని చెప్పుకుంటారు. ఈ నెల 7వ తేదీన ఆయన జయంతి .. ఆయన జన్మించి వందేళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా ఆత్రేయను గురించి 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
"నేను చిత్రపరిశ్రమకు వెళ్లకముందు నుంచి ఆత్రేయ గురించి వింటూ వచ్చాను. చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన తరువాత కూడా ఆయన మేము కలుసుకోలేదు. ఎందుకంటే ఆత్రేయ తన సినిమాలకు తనే కథలను .. మాటలను రాసుకునేవారు. ఇక మనసుపై ఆయన రాసినన్ని పాటలు ఎవరూ రాయలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే 'మనసు' అనే మాటపై కాపీ రైట్స్ ఆయనవే. అలాంటి ఆత్రేయ గురించి ఇంతవరకూ ఎక్కడా చెప్పని ఒక విషయం ఈ రోజు చెప్పాలనుకుంటున్నాను. అది కూడా ఆయన గౌరవాన్ని తగ్గించాలనే ఉద్దేశం కానే కాదు.
వెంకటేశ్ తో రామానాయుడుగారు 'ప్రేమ' సినిమా ప్లాన్ చేసినప్పుడు, ఆ సినిమా రాయడానికి గాను మేము సురేశ్ గెస్టు హౌస్ లో ఉన్నాము. అక్కడికి ఆత్రేయగారు వచ్చారు. " ఇండస్ట్రీలో మీరు రామబాణంలా దూసుకుపోతున్నారు .. దాంతో మాలాంటివారికి పెద్దగా పని ఉండటం లేదు. ప్రేమకి సంబంధించిన సీన్స్ ను నేను చాలా బాగా రాస్తాను. ఈ సినిమాలో ఆ సన్నివేశాలను రాసే అవకాశం నాకు ఇప్పించండి .. నా పేరు వేయనవారం లేదు .. డబ్బులు ఇస్తే చాలు" అన్నారు. ఆయన ఆ మాట అనగానే మా కళ్ల వెంట నీళ్లొచ్చాయి. వెంటనే నాయుడిగారితో మాట్లాడి, ఆ సీన్స్ ను రాసే అవకాశం ఆయనకి దక్కేలా చేయగలిగాము. అప్పటికి ఆయన ప్రభ తగ్గి ఉండొచ్చును కానీ, మనసున్న ప్రతి మనిషి గుర్తుపెట్టుకోదగిన రచయిత ఆత్రేయ" అని చెప్పుకొచ్చారు.