Begin typing your search above and press return to search.
'ఆచార్య'లో ఒకేపని చేయడానికి ఇద్దరు స్టార్లు ఎందుకు?
By: Tupaki Desk | 2 July 2022 1:30 PM GMTచిరంజీవి - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'ఆచార్య' ఏప్రిల్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిరంజన్ రెడ్డి - అవినాశ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను కొరటాల శివ తెరకెక్కించారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, చరణ్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించింది. ఈ సినిమా కోసం టెంపుల్ టౌన్ సెట్ వేయడం విశేషం. భారీ ఖర్చుతో.. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా, భారీ విజయాన్ని అందుకోలేకపోయింది. అలాంటి ఈ సినిమాను గురించి 'పరుచూరి పాఠాలు' వేదిక ద్వారా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
'ఆచార్య' సినిమాను రీసెంట్ గానే చూశాను.. అందుకే ఇప్పుడు ఈ సినిమాను గురించి మాట్లాడుతున్నాను. ఈ సినిమా చూస్తుంటే చాలాకాలం క్రితం మేము రాసిన 'మరో మలుపు' సినిమా గుర్తుకు వచ్చింది.
ఈ సినిమాలో కూడా ఆలయం.. దోపిడీ.. నక్సలైట్ గా శివకృష్ణ రావడం ఉంటుంది. ఆ సినిమాకి అపూర్వమైన ఆదరణ లభించింది. అటు పాదఘట్టం.. ఇటు ధర్మస్థలి.. మధ్యలో జీవధార సాక్షిగా 'ఆచార్య' కథ నడుస్తుంది. 1980లలో ఎర్ర సినిమాలు ఎక్కువగా వచ్చాయి. ఆ తరువాత ఈ తరహా సినిమాలను రాయడం రచయితలు మానేశారు.. తీయడం దర్శకులు మానేశారు.
అలాంటి ఈ సమయంలో మళ్లీ ఎర్ర సినిమాను తెరకెక్కించాలనే కోరిక కొరటాలకు కలగడం.. అందుకు చిరంజీవి గారు అంగీకరించడం గొప్ప విషయం. ఎందుకు జరిగింది? ఏం జరిగింది? అనే విషయాన్ని ప్రేక్షకులకు తెలియకుండా కథను నడిపితే వాళ్లు ఆయోమయానికి లోనవుతారు. ఆ ప్రభావం సినిమా విజయంపై పడుతుంది. ఈ సినిమా విషయంలోను అదే జరిగింది. సస్పెన్స్.. సెంటిమెంట్ ఒక ఒరలో ఇమడవు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చరణ్ పాత్రను ఫస్టాఫ్ లో అక్కడక్కడా కొంతవరకూ చూపిస్తే బాగుండేది. ఆ పాత్రను సెకండాఫ్ వరకూ దాచేయడం వలన, ముందుగా జరుగుతున్న కథ జనానికి ఎక్కలేదు.
ఈ జనరేషన్ కి అభ్యుదయ భావాలు.. కమ్యూనిజానికి సంబంధించిన కథలు ఎక్కడం లేదు. ఈ సినిమాకి ఆశించిన స్థాయి ఆదరణ దక్కకపోవడానికి ఇదొక కారణంగా చెప్పుకోవచ్చు. అసలు చరణ్ ను ఈ సినిమాలో సిద్ధ పాత్రను వేయించకపోతే బాగుండేదనేది నా భావన. చిరంజీవిగారికే 90 శాతం ప్రాధాన్యతనిచ్చి.. ఫ్లాష్ బ్యాక్ కి ఒక 10 శాతం కేటాయించి ఉన్నట్టయితే, ఈ సినిమా రిజల్టు వేరేగా ఉండేదనేది నా ఆలోచన.
ఒకే పని చేయడానికి ఇద్దరు స్టార్లు అవసరం లేదు.. ఒకరు చాలు. ఈ సినిమాలో పాటలైతే నాకు ఎక్కలేదు. 'ఆచార్య' స్థానంలో చిరంజీవి స్టెప్పులు వేయకుండా ఉంటే బాగుండేదనిపించింది. ఆయన బాడీ లాంగ్వేజ్ కి ఈ కథాంశం కరెక్ట్ కాదేమో.. 'ఆచార్య' అనే టైటిల్ కూడా సెట్ కాలేదేమో అనేది నా ఉద్దేశం" అంటూ చెప్పుకొచ్చారు.