Begin typing your search above and press return to search.
కథను నమ్మితే కాసుల వర్షం కురవాల్సిందే!
By: Tupaki Desk | 27 Aug 2022 4:30 PM GMTకల్యాణ్ రామ్ కథానాయకుడిగా ఇటీవల వచ్చిన 'బింబిసార' సంచలన విజయాన్ని సాధించింది. నూతన దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాతో పరిచయమయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలైన ఈ సినిమా వసూళ్ల వర్షాన్ని కురిపించింది. తాజాగా ఈ సినిమాను గురించి 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ .. " గతంలో కల్యాణ్ రామ్ కి రెండు సినిమాలు రాశాముగాని .. ఆయనకి మేము హిట్ ఇవ్వలేకపోయాము. ఎన్టీఆర్ మాదిరిగానే తను కూడా మాతో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు.
ఈ సినిమా చూసిన తరువాత కల్యాణ్ రామ్ ఒక రిస్కీ ప్రాజెక్టు చేశాడనిపించింది. ఒక కాలంలో ఏ పాప ప్రాణాలనైతే హీరో తీశాడో .. మరో కాలంలో ఆ పాపను బ్రతికించడం కోసం హీరో తన ప్రాణాలను ఇవ్వడమే ఈ కథలోని ఆత్మ. 'పాతాళ భైరవి' సినిమాలోని అంశం నుంచి కూడా దర్శకుడు స్ఫూర్తిని పొందినట్టుగా నాకు అనిపించింది.
తాతగారు .. ఆయన చేసిన జానపదాలు .. అవి సాధించిన విజయాలను దృష్టిలో పెట్టుకుని కల్యాణ్ రామ్ ఈ సినిమా చేసి ఉంటాడని నేను భావిస్తున్నాను. నందమూరి వంశంలో పుట్టినవారికి జానపదాలపై .. పౌరాణికాలపై ప్రేమ ఉంటుందనే విషయాన్ని కల్యాణ్ రామ్ మరోసారి నిరూపించాడు.
40 కోట్ల బడ్జెట్ తో .. ఒక కొత్త దర్శకుడితో నిజంగానే కల్యాణ్ రామ్ రిస్క్ చేశాడు .. ఇది మామూలు విషయం కానే కాదు. కల్యాణ్ రామ్ కథను నమ్మాడు .. దర్శకుడిని నమ్మాడు. ఈ పాత్రకు నేను సరిపోతాను .. నేను చేయగలను అని తనని తాను నమ్మాడు.
అందువల్లనే ఈ సినిమా అంతగా విజవవంతమైంది .. విడుదలైన ప్రతి చోటున కాసుల వర్షాన్ని కురిపించింది. ఇద్దరు కథానాయికలు ఉన్నప్పటికీ కథకు ఎంతవరకూ అవసరమో వాళ్ల పాత్రలను అంతవరకు మాత్రమే ఉపయోగించుకోవడం జరిగింది.
ఈ సినిమాలో కొన్ని లాజిక్కులు లేకపోలేదు. అయితే వశిష్ఠ స్క్రీన్ ప్లే తో మేజిక్ చేశాడు. ఈ సినిమా ఫస్టాఫ్ అంతా కూడా కల్యాణ్ రామ్ విలన్ గానే కనిపిస్తాడు. సెకండాఫ్ లో విలన్ షేడ్స్ తొలగిపోయి అతనిలో మంచి మార్పు అనేది ఎప్పుడు ఎక్కడ నుంచి మొదలైందనేది బాగా చూపించారు. నిధి గల గుహ తలుపులను ఓపెన్ చేసే విషయంలోనూ ఆసక్తిని రేకెత్తించారు. సంజీవని పుష్పంతో బింబిసారుడిని బ్రతికించడంతో సెకండ్ పార్టు మొదలవుతుందని నేను అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.