Begin typing your search above and press return to search.
అందుకు వెంకటేశ్ ఒప్పుకోవడమే ఆశ్చర్యం: పరుచూరి
By: Tupaki Desk | 13 Aug 2022 7:40 AM GMTఅనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్ 3' సినిమాను గురించి తాజాగా 'పరుచూరి పలుకులు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. 'ఎఫ్ 3' సినిమాను గురించి ఆయన మాట్లాడుతూ.. 'ఎఫ్ 2' చూసిన కళ్లతో 'ఎఫ్ 3' చూస్తే ఆ సినిమా అంతగా ఈ సినిమా బాగోలేదనిపించింది. ఖర్చు పరంగా చూసుకుంటే అద్భుతమైన లాభాలు కూడా తెచ్చిపెట్టిన సినిమా కాదనే విషయం నాకు అర్థమైంది. 'ఎఫ్ 2' కంటే 'ఎఫ్ 3' బాగా ఆడాలి... అంతకంటే ఎక్కువగా కలెక్ట్ చేయాలి.. కానీ అలా జరగలేదు. 'ఎఫ్ 2' విషయానికి వస్తే భార్యాభర్తల్లో ఎవరి మాట నెగ్గాలనే ఒక లైన్ తీసుకున్నారు.
చాలా ఇళ్లలో ఇప్పటికీ రన్ అవుతున్న రియల్ పాయింట్ కావడం వలన.. మన పక్కింట్లో జరుగుతున్న కథ మాదిరిగా అనిపించడం వలన జనానికి ఎక్కేసింది. ఈ సినిమా అనిల్ రావిపూడి స్ట్రెంత్ ను పెంచింది. ఇక రైటర్ గా.. స్క్రీన్ ప్లే రైటర్ గా.. దర్శకుడిగా ఆయన గెలిచాడు. 'ఎఫ్ 3' విషయానికి వచ్చేసరికి మేము చేసిన 'శ్రీకట్న లీలలు' సినిమా గుర్తుకు వచ్చింది. ఆ సినిమా కథలో మేము చేసిన పొరపాటును 'ఎఫ్ 3' సినిమా సెకండాఫ్ లో అనిల్ రావిపూడి చేశాడా? అనిపించింది. సెకండాఫ్ కి వచ్చేసరికి కథ పట్టాలు తప్పేసింది.
ఒక చీటింగ్ డ్రామాను దాదాపు 40 నిమిషాలు నడిపారు. మురళీ శర్మ తప్పిపోయిన కొడుకుగా ఆ ఇంటికి వెంకటేశ్ గారు వెళతాడు. ఆ పాత్రకి ఉండవలసిన వయసు 20 ఏళ్లు.. వెంకటేశ్ గారి వయసు మనందరికీ తెలుసు. సాధారణంగా ఇలాంటి లాజిక్ లేని సీన్స్ ను వెంకటేశ్ గారు ఒప్పుకోరు. ఎందుకంటే ఆయన సినిమాలకి పనిచేసిన అనుభవం మాకు ఉంది.
ఆయన అలా చేయడానికి ఎలా అంగీకరించారా అనేది నాకు అర్థం కాలేదు. తమన్నాకు మీసాలు పెట్టేసి తీసుకురావడం.. ఇదంతా కూడా స్టుపిడ్ కామెడీ క్రిందికి వస్తుంది. 'మీరు ఏం రాస్తే మేము అది చూడాలా?' అని ఒకసారి ఆడియన్స్ నన్ను డైరెక్టుగా అడిగేశారు.
మనం ఏం చేస్తే అది చూడటానికి ఆడియన్స్ సిద్ధంగా ఉండరనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. 'ఎఫ్ 3' సినిమాలోని చీటింగ్ గ్యాంగ్ అంతా కూడా వరుణ్ తేజ్ ను మురళీ శర్మ ఇంటికి తీసుకుని వచ్చి.. చిన్నప్పుడు మాకు దొరికాడు అని అబద్ధం చెప్పేసి అతణ్ణి అడ్డుపెట్టుకుని డ్రామాను నడపగలిగి ఉంటే ఈ సినిమా ఇంకా డిఫరెంట్ గా ఉండేది.
కథలో హీరో తన కోసం.. తన కుటుంబం కోసం సాహసాలు చేస్తే జనాలు విజిల్స్ వేస్తారు. కానీ డబ్బుకోసం హీరోలు అలా చేయడం ఆడియన్స్ కి నచ్చలేదు. అంత ప్రమాదకరమైన అంశం కావడం వల్లనే ఆడియన్స్ కి అంతగా ఆ సినిమా కనెక్ట్ కాలేకపోయింది" అంటూ చెప్పుకొచ్చారు.