Begin typing your search above and press return to search.
కలెక్షన్ కింగ్ పరుచూరి వారి మాట వింటారా?
By: Tupaki Desk | 2 March 2022 1:30 AM GMTకలెక్షన్ కింగ్ మోహన్ బాబుపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మహా శివరాత్రి సందర్భంగా మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్ బాబు తన మాట వినలేదని, తన మాట వినివుంటే ఇలా జరిగేది కాదని ఫలితం మరోలా వుండేదని చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన చిత్రం `సన్ ఆఫ్ ఇండియా`. డైమండ్ రత్నబాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 18న విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేక పోయింది.
అయితే ఈ చిత్రంపై ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయడంపై పరుచూరి గోపాలకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. మంగళవారం విడుదల చేసిన వీడియోలో మోహన్ బాబుపై ఆయనతో తమకు ఎదురైన చేదు అనుభవాలపై ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. 40 సంవత్సరాలకు పైగా సుధీర్ఘమైన సినీ జీవితంలో ఎన్నో అద్భుతమైన సందేశాత్మక చిత్రాలని అందించాడు. అదే తరహాలో తాజాగా గొప్ప సందేశంతో `సన్ ఆఫ్ ఇండియా` చిత్రాన్ని చేశారు.
నా మాటని గౌరవించి ఈ సినిమాని థియేటర్లలో కాకుండా ఓటీటీలో రీలీజ్ చేయమని తనని రిక్వెస్ట్ చేశా. నేను కోరినట్టే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయివుంటే ఆ సలహా ఇచ్చినందుకు అంతా నన్ను అభినందించేవారు. మోహన్ బాబుతో అనుబంధం మాది ఈనాటిది కాదు.
నేను అన్నయ్య కలిసి డైలాగ్ లు రాసిన `అగ్నిజ్వాల`కు మమ్మల్ని తప్పించాడు. మేము వద్దని మమ్మల్ని తీసేసి మరో రచయితని పెట్టుకున్నారు మోహన్ బాబు. అలా మాకు దూరమైన మోహన్ బాబుతో మేము అసెబ్లీ రౌడీ, రౌడీగారి పెళ్లాం, బ్రహ్మ, అడవిలో అన్న వంటి చిత్రాలకు పని చేశాం.
ఇలా ఆయనతో కలిసి పని చేస్తామని, చరిత్ర సృష్టించినటువంటి చిత్రాలకు పని చేస్తామని అనుకోలేదు. మోహన్ బాబు విలన్ గా వున్నప్పుడు ఎన్నో చిత్రాలు రాశాం. `అసెంబ్లీ రౌడీ` సినిమాని మద్రాస్ లోని ఓ థీయేటర్ లో వేస్తే .. చూసిన ఇండస్ట్రీ వారంతా మోహన్ బాబుతో మాట్లాడకుండా వెళ్లిపోతున్నారు.
అది గమనించి కంగారుగా నా దగ్గరికి వచ్చిన మోహన్ బాబు ఏంటీ సోదరా ఇది? ఇలా వెళ్లిపోతున్నారేంటీ? అని అడిగారు.. రేపు సాయంత్రం దాకా ఆగు బాబు అని చెప్పాను. అయితే ఆ రోజు సాయంత్రానికి ఒక థియేటర్ తో ప్రారంభమైన అసెంబ్లీ రౌడీ తిరుపతి లోని థియేటర్లన్నింటిలో ఫుల్ అయిపోయింది. ఆ తరువాత నా ఇంటికి వచ్చి నాకు మోహన్ బాబు గజమాల వేశాడు.
అలాంటి డైలాగ్ డిక్షన్ వున్న మోహన్ బాబు తాజా చిత్రంలోనూ అదే స్థాయి డైలాగ్ లు `సన్ ఆఫ్ ఇండియా`లో వున్నాయి` అన్నారు పరుచూసి గోపాల కృష్ణ.
ఇలాంటి సందేశాత్మక చిత్రాలని థియేటర్లలో కాకుండా ఓటీటీలో రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఇటీవల సూర్య నటించిన `జై భీమ్` చిత్రాన్ని థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేశారు. థియేటర్ల యాజయాన్యాలు తన సినిమాలని బ్యాన్ చేస్తామని హెచ్చరించినా వినకుండా `జై భీమ్`ని సూర్య ఓటీటీకే అందించాడు.
ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయితే సూర్యని ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చదు. అందుకే సూర్య `జై భీమ్`ని ఓటీటీలో రిలీజ్ చేయడానికే ఇష్టపడ్డారు. అదే తరహాలో `సన్ ఆఫ్ ఇండియా` చిత్రాన్ని కూడా ఓటీటీలో రిలీజ్ చేసివుంటే బాగుండేది` అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.