Begin typing your search above and press return to search.
పరుచూరి బ్రదర్స్.. ఆ పేరెలా వచ్చింది
By: Tupaki Desk | 21 Jan 2016 11:30 AM GMTక్రియేటివిటీకి నెలవైన సినీ పరిశ్రమలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకే విభాగంలో సమన్వయంతో పని చేయడం అరుదుగా జరుగుతుంది. ఐతే పరుచూరి సోదరులు మాత్రం దాదాపు నాలుగు దశాబ్దాలుగా కలిసి సాగుతున్నారు. ఎంత అన్నదమ్ములైనా సరే.. ఏ ఇగోస్ లేకుండా కమ్యూనికేట్ చేసుకుంటూ సాగడం చిన్న విషయమేమీ కాదు. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అన్న ఫీలింగ్ వీరి మధ్య వచ్చినట్లు ఎప్పుడూ వినలేదు. ఐతే ఆ ఇబ్బంది రాకుండా ఇద్దరూ పరుచూరి బ్రదర్స్ అని కలిపి పేరు వేసుకోవడం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. ఐతే టైటిల్ కార్డ్స్ లో అలా ‘పరుచూరి బ్రదర్స్’ అని పేరు వేసుకోవాలన్న ఆలోచన మాత్రం వారిది కాదట.
ముందు కేవలం పరుచూరి అని టైటిల్ వేసుకుంటుంటే.. దానికి బ్రదర్స్ అని యాడ్ చేసింది ఎన్టీఆరే అని వెల్లడించారు పరుచూరి గోపాలకృష్ణ.‘‘అవును. మా ఇద్దరికీ కలిపి పరుచూరి బ్రదర్స్ అన్న పేరు అన్న ఎన్టీఆరే పెట్టారు. ఒక రోజు మమ్మల్ని పిలిపించి.. ఏం బ్రదర్, కథలు, మాటలు అన్నదమ్ములిద్దరూ రాస్తున్నారు. మరి సినిమాల్లో పరుచూరి అని ఒకరు పేరు వచ్చేలా ఎందుకు పెడుతున్నారని అడిగారు. ఏం చేయాలో తెలియక అలా వేస్తున్నాం అన్నాను. పరుచూరి అండ్ పరుచూరి అని లేదా ఇద్దరి పూర్తి పేర్లు పెట్టాలనుకుంటున్నామని చెప్పాం. ఐతే అన్నగారు ఒక్క నిమిషం ఆగి పరుచూరి బ్రదర్స్ అని పెట్టుకోండని చెప్పారు. అంతే తర్వాత అదే ఖాయమైపోయింది’’ అని గోపాలకృష్ణ చెప్పారు.