Begin typing your search above and press return to search.

‘అన్నగారి అరుదైన జ్ఞాపకం’: ప‌రుచూరి

By:  Tupaki Desk   |   30 Oct 2017 12:28 PM GMT
‘అన్నగారి అరుదైన జ్ఞాపకం’: ప‌రుచూరి
X
టాలీవుడ్ లోని ప్ర‌ముఖ ర‌చ‌యిత‌లు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ కు నంద‌ర‌మూరి ఫ్యామిలీతో ప్ర‌త్యేక అనుంబంధం ఉన్న సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఆ విష‌యాన్ని వారు స్వ‌యంగా ప‌లు సంద‌ర్భ‌ల్లో వెల్ల‌డించారు కూడా. అనురాగ దేవ‌త సినిమా స‌మ‌యంలో విశ్వ‌విఖ్యాత న‌టుడు - నంద‌మూరి తార‌క‌రామారావు త‌మ‌కు ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ అని నామ‌క‌ర‌ణం చేశార‌ని ఓ ఇంట‌ర్వ్యూ సంద‌ర్భంగా ప‌రుచూరి గోపాలకృష్ణ చెప్పారు. అన్న‌ద‌మ్ములిద్ద‌రూ ఎప్పుడూ క‌లిసుండాల‌నే ఉద్దేశంతోనే ఇద్దరికీ క‌లిపి అన్న‌గారు ఒకే పేరు పెట్టార‌ని ఎన్టీఆర్ తో త‌న‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇలా సంద‌ర్భం వ‌చ్చిన‌పుడ‌ల్లా ఆ మ‌హానటుడితో త‌మకున్న జ్ఞాప‌కాల‌ను నెమ‌రువేసుకోవ‌డం గోపాలకృష్ణకు అల‌వాటు.

తాజాగా, ఎన్టీఆర్ పై త‌న‌కున్న‌ వ‌ల్ల‌మాలిన అభిమానాన్ని చాటుతూ అన్న‌గారి అరుదైన‌ ఫొటోను ప‌రుచూరి ట్వీట్ చేశారు. ప్ర‌స్తుతం ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఎన్టీఆర్ గ్రాడ్యుయేషన్ పట్టా పొందినపుడు తన మిత్రులతో కలిసి దిగిన ఫొటోను ప‌రుచూరి షేర్ చేశారు. ‘అన్నగారి అరుదైన జ్ఞాపకం’ అని ఆ ఫొటోకు క్యాప్ష‌న్ కూడా పెట్టారు. ఆ ఫొటోలో ఎన్టీఆర్ ఠీవిగా కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చుని ఉన్నారు. ఆయన మిత్రులు అన్న‌గారికి చెరోవైపు నిలబడి ఉన్నారు. యువ‌కుడిగా ఉన్న ఎన్టీఆర్ ఫొటోకు నెటిజ‌న్లు ఫిదా అయిపోయారు. ఇటువంటి అరుదైన ఫొటోను త‌మ‌తో పంచుకున్నందుకు ప‌రుచూరిపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆ ఫొటో సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది.