Begin typing your search above and press return to search.

ఆ దర్శకుడిని బతికిస్తున్న గోపీచంద్

By:  Tupaki Desk   |   4 Nov 2015 7:09 AM GMT
ఆ దర్శకుడిని బతికిస్తున్న గోపీచంద్
X
పరుచూరి మురళి గుర్తున్నాడా? ‘నీ స్నేహం’ లాంటి సెన్సిబుల్ మూవీతో దర్శకుడిగా పరిచయమై.. ఆ తర్వాత ఆంధ్రుడు - పెదబాబు లాంటి మాస్ సినిమాలు చేసిన ఈ దర్శకుడికి నాలుగేళ్ల కిందట ఓ లైఫ్ టైం ఛాన్స్ వచ్చింది. నందమూరి బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడతను. ఐతే బాలయ్య ఎంతో నమ్మకంగా అవకాశం ఇస్తే.. దాన్ని ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడతను. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘అధినాయకుడు’ పెద్ద డిజాస్టర్ అయింది. దెబ్బకు పత్తా లేకుండా పోయాడు మురళి.

ఇక మురళి కెరీర్ ముగిసిందేమో అనుకుంటుంటే.. అతడికో అవకాశం ఇచ్చాడు గోపీచంద్. ఇంతకుముందు ‘ఆంధ్రుడు’ కోసం పని చేసిన వీళ్లిద్దరూ మళ్లీ ఓ సినిమా చేయబోతున్నారు. బాలాజీ మీడియా బేనర్ లో భగవాన్ - పుల్లారావు ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ నిర్మాతలు కూడా ఇంతకుముందు గట్టి ఎదురు దెబ్బ తిన్న వాళ్లే. లారెన్స్-ప్రభాస్ కాంబినేషన్ లో వీళ్లు నిర్మించిన ‘రెబల్’ పెద్ద డిజాస్టరైంది. భారీగా నష్టం మూటగట్టుకున్న భగవాన్, పుల్లారావు.. లారెన్స్ మీద కేసు కూడా పెట్టిన సంగతి తెలిసిందే. మొత్తానికి ఆ చేదు అనుభవం నుంచి కోలుకుని ఓ ఫ్లాప్ డైరెక్టర్ తో సినిమా తీయడానికి రెడీ అవడం విశేషం. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.