Begin typing your search above and press return to search.
హీరోయిన్స్ విచారణ వీడియోల లీక్ పై హాట్ బ్యూటీ ఫైర్
By: Tupaki Desk | 22 Sep 2020 12:30 AM GMTకన్నడ హీరోయిన్స్ రాగిణి ద్వివేది మరియు సంజనలు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. వారిని అరెస్ట్ చేసిన వీడియోలు మరియు విచారిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని లేడీ కానిస్టేబుల్స్ షూట్ చేసినట్లుగా క్లీయర్ గా తెలుస్తుంది అంటూ హీరోయిన్ పరూల్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ఒక వైపు లక్షల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. మరో వైపు చైనా ఆగడాలు.. ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్థం అవ్వడం వంటి అతి పెద్ద సమస్యలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో డ్రగ్స్ కేసును దేశ విపత్తు అన్నట్లుగా మీడియా మరియు కొందరు ఫోకస్ చేస్తున్నారు అంటూ పరూల్ యాదవ్ అసహనం వ్యక్తం చేసింది. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇంకా వారి కేసు నిర్థారణ కాకుండానే వారి వీడియోలను లీక్ చేయడం ద్వారా వారి జీవితాలను నాశనం చేసినట్లే అంటూ ఆమె అభ్యంతరం వ్యక్తం చేసింది.
దేశంలో ఉన్న సమస్యల గురించి ప్రస్తుతం ఎక్కడ చర్చ జరుగుతున్నట్లుగా అనిపించడం లేదు. ప్రజలకు ఉన్న కష్టాల గురించి రాజకీయ నాయకులు మరియు మేధావులు పట్టించుకోవడం లేదు. కాని ఎక్కడ చూసినా కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు హీరోయిన్స్ గురించి మాత్రమే చర్చ జరుగుతోంది. పోలీసు డిపార్ట్ మెంట్ మొత్తం కూడా ఇతర చోట్ల ఎక్కడ కేసులు లేవు అన్నట్లుగా మొత్తం దృష్టి ఈ కేసుపైనే పెట్టడం విడ్డూరంగా ఉంది. దేశంలో రాజకీయ నాయకులు మరియు వ్యాపారస్తులు ఎంతో మంది తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అయినా వారిని పట్టించుకునేందుకు జనాలకు సమయం లేదు. కాని డ్రగ్స్ విషయంలో మాత్రం చర్చించుకునేందుకు వారి వద్ద కావాల్సినంత సమయం ఉంది. పోలీసులు ప్రజల కోసం పని చేయాలి. కాని వారు చేస్తున్న పని ఒక్కొసారి చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కావాలని ప్రజల ఆలోచన తప్పుదారి పట్టించి అసలు సమస్యలు వారికి కనిపించకుండా కొందరు చేస్తున్నారేమో అనిపిస్తుంది. దేశంలో ఉన్న సమస్యలు మరియు వాటికి సంబంధించిన పరిష్కారాల గురించి ఆలోచించే వారే నిజమైన దేశ భక్తులు. ఇప్పుడు దేశంలో దేశభక్తులు ఎక్కడ కనిపించడం లేదంటూ పరూల్ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది.